/rtv/media/media_files/2025/01/31/3OeSltxBQeAX8F3wkvdO.jpg)
massage parlor Most Relaxing BODY Massage Viral video
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచం నలుమూలల్లో జరిగిన ప్రతి విషయం ఇట్టే కళ్లముందు కనిపించేస్తుంది. అందులో వైరల్ కావాలని కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం తమ వృత్తిలో భాగమైన పనులతో వైరల్ అయిపోతున్నారు. తాజాగా అలాంటిదే జరిగింది.
Also Read : ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!
విచిత్రమైన మసాజ్ వీడియో
కొందరు మహిళలు ఓ వ్యక్తికి మసాజ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అది నార్మల్ మసాజ్ అయితే పెద్దగా చెప్పుకోవలసిన అవసరం లేకపోయేది. కానీ అది ఫైర్ మసాజ్. అంటే మనిషిని ఒక బెడ్‌పై పడుకోబెట్టి.. దానిపై నిప్పంటిస్తారు.
message parlors just doing anything now pic.twitter.com/1Mvaj5Uglj
— SLOSHUA (@ChampagneSloshy) January 30, 2025
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో అదే కనిపిస్తోంది. ఈ వీడియో ప్రకారం.. ముగ్గురు మహిళలు ఒక వ్యక్తిని బెడ్ పై బోర్లా పడుకోబెట్టారు. ఆపై ఆ వ్యక్తిపైన రెండు మూడు దుప్పట్లు కప్పారు. దానికి నిప్పంటించారు. అలా అంటించిన తర్వాత లైట్ ఆఫ్ చేసి ఆన్ చేశారు.
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!
ఈ క్రమంలో దుప్పటికి అంటిన మంటను మరొక దుప్పటితో ఆపడం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే మసాజ్‌లలో ఇదొక రకమైన మసాజ్‌గా తెలుస్తోంది. ఈ వీడియోపై కొందరు కామెంట్లు చేస్తున్నారు. కాళ్లు, మెడ, వెన్నుముక ఇలా చాలా బాగాలకు మసాజ్‌లా పనిచేసే ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.