Naxals Surrender: లొంగిపోయిన 23 మంది మావోయిస్టులు

ఛత్తీస్‌ఘడ్‌ సుక్మా జిల్లాలో మరో సారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. క‌రుడుగ‌ట్టిన 23 మంది న‌క్సలైట్లు శనివారం పోలీసులకు ముందు సరెండర్ ‌అయ్యారు. వారిలో మూడు జంట‌లు కూడా ఉన్నాయి. వారిపై దాదాపు కోటి 18 ల‌క్షల రివాండ్ ఉంది.

New Update
Naxals Surrender

వరుస ఎన్ కౌంటర్ లతో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌ఘడ్‌ సుక్మా జిల్లాలో మరో సారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. క‌రుడుగ‌ట్టిన 23 మంది న‌క్సలైట్లు శనివారం పోలీసులకు ముందు సరెండర్ ‌అయ్యారు. వారిలో మూడు జంట‌లు కూడా ఉన్నాయి. వారిలో ఉన్న మావోయిస్టులపై దాదాపు కోటి 18 ల‌క్షల రివాండ్ ఉందని సీనియ‌ర్ పోలీసు అధికారి తెలిపారు. స‌రెండ‌ర్ అయిన న‌క్సల్స్‌లో 11 మంది సీనియ‌ర్ కేడ‌ర్ సభ్యులున్నారు. నారాయణపూర్ జిల్లా ఎస్పీ ఎదుట శుక్రవారం 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

పీపుల్స్ లిబ‌రేష‌న్ గెరిల్లా ఆర్మీ బెటాలియ‌న్ నెంబ‌ర్ 1లో వాళ్లు ఉంటున్నారు. మావోయిస్టు ఐడియాల‌జీ, గిరిజ‌నుల‌పై న‌క్సల్స్ పాల్పడుతున అకృత్యాల‌ను త‌ట్టుకోలేక లొంగిపోయార‌ని సుక్మా ఎస్పీ కిర‌ణ్ చావ‌న్ తెలిపారు. లొంగిపోయిన న‌క్సల్స్‌లో 9 మంది మ‌హిళలు ఉన్నారు. లోకేశ్ అలియాస్ పొడియం బీమా, ర‌మేశ్ అలియాస్ క‌ల్మా కేసా, క‌వాసి మాసా, మ‌డ్కమ్ హంగా, నుపు గంగి, పునెం దేవి, పరాస్కి పాండే, మాద్వి జోగా, నుప్పు ల‌చ్చు, పొడియం సుక్రామ్‌, దుది బీమా.. ప్రతి ఒక్కరిపై 8 ల‌క్షల న‌జ‌రానా ఉంది. డివిజ‌న‌ల్ క‌మిటీ స‌భ్యుడిగా లోకేశ్ ఉన్నాడు.

Advertisment
తాజా కథనాలు