Maoist party: ఆ ద్రోహుల వల్లే కేశవరావు ఎన్‌కౌంటర్.. మావోయిస్టుపార్టీ సంచలన లేఖ!

నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. లొంగిపోయిన కోవర్టుల వల్లే ఈ నష్టం జరిగిందని ప్రకటించింది. ఆయన టీమ్‌లో ఆరుగురు ఇటీవలే లొంగిపోయారని, యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహిగా మారినట్లు స్పష్టం చేసింది. 

New Update
Union Govt and CPI Maoist Party

Maoist Party sensational letter releases on Nambala Kesava Rao encounter

Maoist party: నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. లొంగిపోయిన కోవర్టుల వల్లే ఈ నష్టం జరిగిందని ప్రకటించింది. ఆయన టీమ్‌లో ఆరుగురు ఇటీవలే లొంగిపోయారని, యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహిగా మారినట్లు స్పష్టం చేసింది. 

Also Read: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

కమాండో సభ్యుడే దేశద్రోహి..

ఈ మేరకు ద్రోహుల సమాచారం వల్లే మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ జరిగిందని స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది. '6 నెలలుగా కేశవరావు మాడ్ ప్రాంతంలో ఉన్నారనే విషయం పోలీసులకు తెలుసు. ఆయన టీమ్ లోని ఆరుగురు ఇటీవలే లొంగిపోయారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు దేశద్రోహిగా మారాడు. రికీ సహా పలువురి ద్రోహం వల్లే ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు' అని తెలిపింది. 

Also Read: BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

మరోవైపు.. ఇది ఫేక్ ఎన్‌కౌంటర్‌ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ అబూజ్‌మడ్‌ అడవుల్లో మే 21న ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కేశవరావుతో పాటు మరో 26 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఇంతవరకు ఈ ఎన్ కౌంటర్ ఏ ప్రాంతంలో జరిగిందనేది చెప్పడం లేదని, మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించకపోవడంపై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.  ఇక కేశవరావుకు చుట్టూ కనీసం 50 మంది రక్షణగా ఉంటారని, 26 మందినే చూపించడంపై సందేహాలున్నాయంటున్నారు. 

Also Read: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్


Also Read: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

maoist-party | keshava-rao | today telugu news 

Advertisment
Advertisment
తాజా కథనాలు