Mumbai: గణేష్ నిమజ్జనానికి ఆర్డీఎక్స్ బాంబు బెదిరింపు..నోయిడాలో నిందితుడు అరెస్ట్

ముంబైలో గణేష్ నిమజ్జనం వేడుకల్లో కోటి మందిని చంపుతామంటూ ముంబై పోలీసులకు ఓ వ్యక్తి మెసేజ్ పంపాడు. ఇందులో లష్కర్ ఏ జీహాదీ సంస్థ పేరు కూడా ప్రస్తావించాడు. తాజాగా ఈ అజ్ఞాత వ్యక్తికి ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

New Update
rdx

పాకిస్తాన్ నుంచి 14 మంది ఉగ్రవాదులు..34 వాహనాల్లో...400 కిలోగ్రాముల ఆర్డీఎక్స్ తో ముంబైలోకి ప్రవేశించారని...గణేష్ వేడుకల్లో కోటి మంది ప్రజలను చంపుతారని అక్కడి ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు  ఓ సందేశం వచ్చింది. ఇందులో లష్కర్-ఎ-జిహాదీ అనే పేరును కూడా ప్రస్తావించారు. శనివారం నాడు బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుందని ఉంది. ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్న ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. మెసేజ్ పంపిన వ్యక్తి గురించి దర్యాప్తు చేశారు. నిందితుడు నోయిడా కు చెందిన అశ్విన్ గా గుర్తించారు. నోయిడా నుంచే సందేశం పంపినట్లు తెలుసుకున్నారు. దీంతో వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించి..అతన్ని అరెస్ట్ చేయవలసిందిగా నోయిడా పోలీస్ కమిషనర్ లక్ష్మీ సింగ్‌ ను కోరారు. వెంటనే నోయిడా పోలీసులు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అశ్వినిని అరెస్టు చేశారు. నోయిడా సెక్టార్ 113 నుంచి అరెస్టు చేసి ముంబై పోలీసులకు అప్పగించామని నోయిడా పోలీస్ వర్గాలు తెలిపాయి. 

స్నేహితుని మీద పగతో..

బాంబు బెదిరింపు మెసేజ్ పంపిన అశ్విన్ వృత్తిరిత్యా జ్యోతిష్కుడు. ఇతను ఐదేళ్ళుగా నోయిడాలో ఉంటున్నాడు.  తన ఫ్రెండ్ ఫిరోజ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ బాంబు మెసేజ్ పెట్టాడని పోలీసులు తెలిపారు. 2023లో అశ్విన్ పై ఫిరోజ్ కేసు పెట్టాడు. దీని వలన అతను మూడు నెలల పాటూ జైలు శిక్ష అనుభవించాడు. అప్పటి నుంచీ ఫిరోజ్ పై కక్ష పెంచుకున్నాడు అశ్విన్. శనివారం ముంబైలో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం జరుగుతుంది. అలాంటప్పుడు బాంబు బెదిరింపు మెసేజ్ పెడితే ఫిరోజ్ కు పెద్ద శిక్ష పడుతుందని అశ్విన్ భావించాడు. ఆ కారణంగానే ఫిరోజ్‌ పేరుతో ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ఉగ్ర బెదిరింపు మెయిల్స్‌ పంపాడు. కానీ చివరకు అశ్వినే దొరికిపోయాడు. నిందితుడి నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, ఆరు మెమరీ కార్డ్ హోల్డర్లు, రెండు డిజిటల్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

భయపడాల్సింది లేదు..కట్టుదిట్టమైన భద్రత..

మరోవైపు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని ముంబై పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులకు గతంలోనూ ఇలాంటి బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయని తెలిపారు. కీలక ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశామని.. కూంబింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ముంబైవాసులు పుకార్లను నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే చెప్పాలని పోలీసులు కోరారు. మెసేజ్ పంపిన వ్యక్తికి లష్కరే కు ఏం సంబంధం లేదని..అదంతా ఒక అబద్దం అని తేల్చారు. నిమజ్జన రోజున రోడ్లపై జనసందోహం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు గరిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

Also Read: India-Pak War: పాకిస్తాన్ తో యుద్ధం ముగియలేదు..ఆర్మీ చీఫ్ ద్వివేది

Advertisment
తాజా కథనాలు