India-Pak War: పాకిస్తాన్ తో యుద్ధం ముగియలేదు..ఆర్మీ చీఫ్ ద్వివేది

పహల్గాం దాడి తరువాత భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మే 10 తో ముగియలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చెప్పారు. యుద్ధం చాలా కాలం కొనసాగిందని..ఇప్పటికీ ఎల్వోసీ దగ్గర మన సైనికులు పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. 

New Update
Upendra Dvivedi

పాకిస్తాన్ భారత్ ల మధ్య యుద్ధం ముగియలేదని అంటున్నారు భారత ఆర్మీ ఛీప్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.  పహల్గాం దాడి తరువాత భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మే 10 తో ముగియలేదని తర్వాత చాలా కాలం పాటూ కొనసాగిందని తెలిపారు. ఇప్పటికీ కూడా ఎల్వోసీ దగ్గర వార్ జరుగుతూనే ఉందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయాలన్నీ బయట కూడా చెప్పలేమని ద్వివేదీ తెలిపారు. 

సరిహద్దుల్లో పోరాటం కొనసాగుతోంది..

భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో కొనసాగుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. నియంత్రణ రేఖ వెంబడి ఆపరేషన్ సిందూర్ ప్రభావాన్ని అంచనా వేయడం తొందర పాటు చర్యే అవుతుందని జనరల్ ద్వివేది వ్యాఖ్యానించారు. పాక్ మద్దుతు గల ఉగ్రవాదులు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారని..సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ముగిసి చాలా కాలం కాలేదు కాబట్టి, ఎల్‌ఓసి పరిస్థితిపై దాని ప్రభావం గురించి వ్యాఖ్యానించడం అంత సబబు కాదని ద్వివేదీ వివరించారు. భారత ఆర్మీ ఇప్పటికే ఎంతో మంది ఉగ్రవాదుల మట్టుబెట్టింది. అ    లాగే చాలా మంది తప్పించుకున్నారు కూడా.  ఈ నేపథ్యంలో భారత మూడు సేనలు ఐక్య చేయడం చాలా అవసరమని అన్నారు. థియేటరైజేషన్ ఈరోజు అయినా, రేపు అయినా జరుగుతుంది. దానికి ఎంత సమయం పడుతుందనేది మాత్రం చెప్పలేమని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఆధునిక యుద్ధంలో ఏకీకృత కమాండ్ నిర్మాణం చాలా కీలకమని జనరల్ వ్యాఖ్యానించారు. ఒకే కమాండర్ ఉంటే అన్ని ఏజెన్సీలను సమన్వయం చేయడం సులువు అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దీంతో పాటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలను . జీఎస్టీ మార్పులను జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్వాగతించారు.  ఈ సంస్కరణలు రక్షణ కారిడార్లను బలోపేతం చేస్తాయని, ఈ రంగంలో చిన్న సంస్థల నుండి ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని ఆయన అన్నారు.  పెట్టుబడులు పెరిగే కొద్దీ మా రక్షణ కారిడార్లకు పెద్ద ప్రోత్సాహం లభిస్తుంది. పరిమిత వనరులతో తరచుగా ఇబ్బంది పడే MSMEలు మరియు స్టార్టప్‌లు ఈ GST కోత వల్ల అపారమైన ప్రయోజనం పొందుతాయని చెప్పుకొచ్చారు. 

Advertisment
తాజా కథనాలు