ఎమ్మెల్యేలు జారీపోకుండా కాంగ్రెస్ బిగ్ ప్లాన్ .. రిసార్ట్స్, ఫ్లైట్స్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే రిసార్ట్ లు, ఫ్లైట్ లు రెడీ చేసినట్లు తెలుస్తోంది. 

author-image
By srinivas
New Update

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే రిసార్ట్ లు, ఫ్లైట్ లు రెడీ చేసినట్లు తెలుస్తోంది. 

విజయం మహాయుతి కూటమిదే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే కౌంటింగ్ మొదలుపెట్టింది. మధ్యాహ్నం వరకు ఎవరు గెలవబోతున్నారో తేలబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే ఏకంగా రిసార్ట్స్, ఫ్లైట్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన ఎమ్మె్ల్యేలను కర్ణాటక, తెలంగాణకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అధికార మహాయుతి.. ప్రతిపక్ష మహా వికాస్ ఆఘాఢీ కూటములు తమదే విజయం అని చెబుతున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ విజయం మహాయుతి కూటమిదే అంటున్నాయి. 

తెలంగాణ, కర్ణాటకకు తరలింపు.. 

తెలంగాణ, కర్ణాటకలోని ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో ఎమ్మెల్యేలతోపాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఉంచేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేలను తరలించేందుకు విమనాలు కూడా సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మహాయుతి కూటమి ఎమ్మెల్యేలను బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌కు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.. ఏకంగా తెలుగు సినిమాలోనే?

ఇక మహా వికాస్ అఘాడీ కూటమి ఎమ్మెల్యేలంతా ముంబైలోనే ఉంటారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాల్లో మహా వికాస్ ఆఘాఢీ కూటమి 160 సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మహా వికాస్ ఆఘాఢీ కూటమికే మద్దతు ఇస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. మహా వికాస్ ఆఘాఢీ కూటమి అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వ అధినేతనే సీఎ అవుతారని చెప్పారు. 

ఇది కూడా చదవండి: మళ్లీ యాక్టివ్ అయిన కవిత.. జాగృతి నాయకులతో కీలక సమావేశం.

Advertisment
Advertisment
తాజా కథనాలు