/rtv/media/media_files/2024/11/23/N246yxgBcBeStNB9JXWQ.jpg)
టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ త్వరలోనే హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. అదికూడా మన తెలుగు సినిమాతో పరిచయం కాబోతుంది. ఇటీవల ఈమెకు టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. అదికూడా దిల్ రాజు లాంటి టాప్ ప్రొడక్షన్ హోస్ లో కావడం విశేషం.
దిల్ రాజు సినిమాలో హీరోయిన్ గా..
యంగ్ కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా ‘ఆకాశం దాటి వస్తావా’ అనే సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా మలయాళ నటి కార్తీక మురశీధరన్ నటిస్తోంది. మరో నాయికగా ధనశ్రీని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
Indian cricketer Yuzvendra Chahal's wife, #DhanashreeVerma, is set to make her Telugu film debut in an upcoming movie, playing a significant role. pic.twitter.com/baM7bHyhui
— Movies4u Official (@Movies4u_Officl) November 20, 2024
Also Read: రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేకు షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు
ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్ తో పాటూ సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఇక ధనశ్రీ విషయానికొస్తే.. సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ గా ఆమె చాలా ఫేమస్. పలు డ్యాన్స్ వీడియోలతో, రీల్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొరియోగ్రాఫర్ గా ఆమె సొంతంగా ఓ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేస్తోంది.
Indian cricketer #YuzvendraChahal’s wife #DhanashreeVerma, who is a professional dancer, is making her Tollywood debut with Dil Raju’s #AakasamDhaatiVasthaava !!#Cinee_Worldd pic.twitter.com/hW85kw3Jgt
— cinee worldd (@Cinee_Worldd) November 21, 2024
ఈమె డ్యాన్స్ టాలెంట్ చూసే దిల్ రాజు మూవీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక 'ఆకాశం దాటి వస్తావా' సినిమా విషయానికొస్తే.. శశి కుమార్ ముతిల్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ గాయకుడు కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. కొరియాగ్రాఫర్ యశ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
Also Read: Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు