/rtv/media/media_files/2025/03/12/dyMA3GL4qr8SCRzItlKR.jpg)
Madras High Court
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగమైన త్రిభాషా సూత్రంపై కేంద్రం, డీఎంకే పార్టీ మధ్య గత కొన్నిరోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వాళ్లకు తప్పకుండా తమిళంలో చదవడం, రాయడం వచ్చి ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB)లో జూనియర్ అసిస్టెంట్ జాబ్ పొందాలంటే తప్పకుండా తమిళ భాష పరీక్షలోనే ఉత్తీర్ణత సాధించాలని స్పష్టం చేసింది.
Also Read: 350 ఏళ్ల పోరాటం.. దళితులకు ఆ గుడిలో పూజలు చేసుకునేందుకు అనుమతి!
లేకపోతే ఉద్యోగానికి అనర్హులని తేల్చిచెప్పింది. టీఎన్‌ఈబీ నిర్వహించిన తమిళ లాంగ్వేజ్ టెస్టులో ఫెయిలైన అభ్యర్థి ఈ అంశంపై కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం మాతృభాష ప్రస్తావనను తీసుకొచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన జే.జైకుమార్ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఉద్యోగి. ఈయన రెండేళ్లలో తమిళ భాష పరీక్ష పాస్ కావాల్సి ఉంది. కానీ పాస్ కాలేదు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేసింది. ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయాననే బాధతో ఆయన తమిళనాడు హైకోర్టులో పిటిషన్ వేశారు.
Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!
తన తండ్రి నావీ సర్వీస్‌లో పనిచేయడం వల్ల CBSC పాఠశాలలో చదివానని.. అందుకే తాను తమిళం నేర్చుకోవడం కుదరలేదని చెప్పారు. తాజాగా దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌కు మాతృభాష అయిన తమిళం రాకపోవడంపై ప్రశ్నలు అడిగింది. ప్రభుత్వ ఉద్యోగులు తమిళం రాకుండా ఎలా పనిచేయగలరని.. రోజువారి పనులు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర భాష గురించి తెలియాలని.. లేని పక్షంలో ఉద్యోగాలు ఎలా చేస్తారంటూ అడిగింది. అభ్యర్థులు భాష పరీక్షను నిర్ణీత సమయంలోనే పాస్ అవ్వాలని.. తమిళ భాష నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం యత్నించాలని చెప్పింది. చివరికి ఇరుపక్ష వాదనలు విన్న ధర్మాసనం మరో ఆరువారాల పాటు కేసును వాయిదా వేసింది.