మాజీ కానిస్టేబుల్ ఇంట్లో రూ.500 కోట్లు.. 66పేజీల డైరీలోనే అసలు కథ

మధ్యప్రదేశ్ రాజకీయాలు రైడ్స్‌లో దొరికిన మాజీ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. జనవరి 15న కాంగ్రెస్ నేత పట్వారి ప్రెస్ మీట్‌లో రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీశారు.

author-image
By K Mohan
New Update
gwaliyar

gwaliyar Photograph: (gwaliyar)

మధ్యప్రదేశ్‌ రవాణా శాఖలో మాజీ కానిస్టేబుల్ అవినీతి ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకాయుక్త పోలీసులు, ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎక్స్ కానిస్టేబుల్ సౌరబ్ శర్మ ఇంట్లో దాడులు నిర్వహించాయి. సోదాల్లో రూ.500 కోట్ల విలువైన ఆస్తులు దొరికాయి. గతేడాది డిసెంబర్ 19న సోదాలు జరగగా.. సదరు మాజీ కానిస్టేబుల్ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అంతేకాదు.. సోదాలు చేసిన అధికారులకు 66 పేజీల డైరీ కూడా దొరికింది. ఆ డైరీలో ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు? ఏ చెక్‌పోస్ట్ దగ్గర ఎంత లంచం తీసుకుంటున్నారని పై అధికారుల అవినీతి చిట్టా ఉంది.

Also Read: ప్రభుత్వ సొమ్ము ప్రజల కోసమా ? సైకిల్ ట్రాక్‌ల కోసమా ?.. సుప్రీంకోర్టు ఆగ్రహం

చెక్‌పోస్టుల నుంచి రూ.1,300 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు రికార్డులు డైరీలో ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ 15 నెలల పాలన అవినీతితో నిండిపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. అవినీతి ఆరోపణను తిప్పికొడుతూ కమల్ నాథ్ కాంగ్రెస్ పాలన 15 నెలల ప్రభుత్వాన్ని పట్వారీ గుర్తు చేసుకోవాలని బిజెపి మీడియా ఇన్‌ఛార్జ్ ఆశిష్ అగర్వాల్ అన్నారు.

Also Read: పెద్ద చదువులు చదివి సన్యాసం.. కుంభమేళలో IIT బాబా వైరల్

గ్వాలియర్‌కు చెందిన సౌరబ్ శర్మ 2015లో తన తండ్రి మరణంతో రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా కారుణ్య నియామకం అయ్యాడు. ఆయన ఇంటిపై రైడ్స్ తో మధ్యప్రదేశ్ రవాణా శాఖలో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించుకుంటున్నాయి.  సౌరభ్ శర్మపై లోకాయుక్త దాడుల్లో పాడుబడిన వాహనంలో రూ.11 కోట్ల నగదు, 52 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్టార్ట్ అయిన స్టోరీ ప్రస్తుతం రాజకీయ మలుపులు తిరుగుతుంది.

Also Read: జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం.. !

66 పేజీల డైరీలో కేవలం ఆరు పేజీలను మాత్రమే చూశామని, మిగిలినవి కనిపించడం లేదని జనవరి 15న కాంగ్రెస్ నేత పట్వారి ప్రెస్ మీట్‌లో రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే దర్యాప్తు నిలిచిపోయినట్లు ఉందని.. ఈ ఆరు పేజీలకు ఎవరూ బాధ్యత వహించడం లేదని పట్వారీ నిలదీశాడు. మాజీ కానిస్టేబుల్ ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ కానిస్టేబుల్ ప్రాణాలకు భద్రత కల్పించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు