/rtv/media/media_files/2024/11/20/8TL1QnVDd0qt87vvOIBi.jpg)
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి రెడీ అవుతుంది. రాష్ట్రంలోని ప్రముఖ మతపరమైన నగరాలు, పట్టణాల్లో మద్యాన్ని బ్యాన్ చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ కొత్త మద్యం పాలసీ విధానంలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వయంగా ప్రకటించారు. ఈ మద్యపాన నిషేధం పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైందని.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కొత్త పాలసీ అమల్లోకి రానున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం చెప్పారు.
Also Read: BIG BREAKING: పండగ వేళ తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్, ఓర్చా, ఉజ్జయిని, చిత్రకూట్ వంటి మతపరమైన నగరాల పరిధిలో మద్యం అమ్మకాలు నిషేధిస్తామని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్న కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతున్న వేళ.. మద్యం పాలసీల్లో ఈ నిర్ణయాన్ని సవరించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
Also Read: HMPV Virus: హెచ్‌ఎంపీవీ శరీరంలోని ఏ భాగానికి మొదట దాడి చేస్తుంది
ఇప్పటికే ఈ అంశంపై స్పందించాలని చాలా మంది సాధువులు, ఋషులు తమకు విజ్ఞప్తులు తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆధ్యాత్మిక నగరాలు, పట్టణాల్లో మద్యం ఉండకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకే ఈ మద్యపాన నిషేధ పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
ఆర్థిక సంవత్సరంలో..
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. అయితే ఇలా చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు తగ్గిపోయే మద్యం ఆదాయాన్ని భర్తీ చేయడానికి.. మతపరమైన నగరాల సరిహద్దుల వెలుపల మద్యం దుకాణాలను తెరవడంపై ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇక మధ్యప్రదేశ్‌లోని మతపరమైన నగరాల్లో మద్య నిషేధం అమలు చేయాలన్న సీఎం ప్రకటన పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జితూ పట్వారీ స్పందించారు. సీఎం మోహన్ యాదవ్ రోజుకో కొత్త వాగ్దానాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Telangana: అత్యవసరమైతేనే తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకోండి!
Also Read: South Korea: అభిశంసనకు గురైనా..ఆ అధ్యక్షుడి జీతం పెరిగిందోచ్!