/rtv/media/media_files/2024/12/04/wknlLuje6tH3giRMICKu.jpg)
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అభిశంసనకు గురైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయన అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2025 ఏడాదికి గాను ఆయన వార్షిక వేతనం సుమారు 3 శాతం పెరగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: California: ఖైదీలకు కలిసొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు!
దక్షిణ కొరియా సిబ్బంది నిర్వహణ శాఖ ప్రకారం..ప్రభుత్వ అధికారుల ప్రామాణిక నియమాల కింద అధ్యక్షుడి జీతం పెరగనున్నట్లు సమాచారం. అభిశంసన విచారణ ప్రక్రియ కొనసాగే ఆరు నెలల పాటు దాదాపు 130 మిలియన్ వోన్ లు తీసుకోనున్నారు. ప్రస్తుతం 1.70 లక్షల డాలర్లుగా ఉండగా..తాజా పెంపుతో 1.79 లక్షల డాలర్లకు వరకు పెరగనున్నట్లు అధికారులు తెలిపారు.
నిబంధనలను ఉల్లంఘించడమే..
అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగనప్పటికీ ఆయనకు ఈ జీతం అందుతుంది.అదే విధంగా..అభిశంసనకు గురైన ప్రధాన మంత్రి హన్ డక్ సూ కూడా 3 శాతం జీతం పెరిగింది. నో వర్క్,నో పే నిబంధన ప్రకారం వీరిద్దరికి పూర్తి జీతం ఇవ్వడం నిబంధనలను ఉల్లంఘించడమే అని సమాచారం.
అయితే..అభిశంసనకు గురైన ప్రభుత్వాధికారులకు జీతాలు చెల్లించే విషయం మై ఎటువంటి నిబంధన లేకపోవడంతో దీని పై ఎలాంటి స్పష్టత లేదు. ఇదిలా ఉంటే దేశంలో మార్షల్ లా విధిస్తున్నట్లు అధ్యక్షుడు యూన్ సుక్ ఉత్తర్వులు జారీ చేయడంతో దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది.దీనికి వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంలో ఓడిపోవడంతో యూన్ అధ్యక్ష అధికారాలను కోల్పోవాల్సి వచ్చింది.
ఈ క్రమంలో యూన్ ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం 180 రోజుల్లోగా తేల్చనుంది. ఒకవేళ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాలని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే 60 రోజుల్లోగా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
Also Read: Maha Kumbh Mela: మహా కుంభమేళా.. యూపీకి రూ.2 లక్షల కోట్ల ఆదాయం !
Also Read: BIG BREAKING: పండగ వేళ తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే జాతీయ పసుపు బోర్డు ప్రారంభం