జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. ఈ అంశాన్ని సహా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై చర్చించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు సీఎం త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నట్లుగా అధికారులు తెలిపారు.
Also Read: ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు!
మరోవైపు జమ్మూకశ్మీర్‌లో మొదటి అసెంబ్లీ సమావేశం నవంబర్ 4న జరగనుందని కేబినెట్ తెలిపింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయించేందుకు ముబారిక్ గుల్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని కేబినెట్ సిఫార్సు చేసింది. పర్మినెంట్ స్పీకర్ వచ్చేవరకు ఆయనే ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ ఎల్జీ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు..
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌కు మొదటి సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ (NC) నేత ఒమార్ అబ్దల్లా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు కూడా ఆయన సీఎంగా పనిచేశారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత గత ఐదేళ్లుగా జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనే అమల్లో ఉంది.
Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
జమ్మూకశ్మీర్‌గా కేంద్ర పాలిత ప్రాంతంగా మారాక.. ఇటీవల జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 90 సీట్లకు గాను ఎన్‌సీ 42 సీట్లు సాధించగా.. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచింది. ఇక ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లానే ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నికయ్యారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా, తాతా షేక్ అబ్దుల్లా కూడా గతంలో జమ్మూకశ్మీర్‌కు ముఖ్యమంత్రులుగా సేవలందించారు.
Also Read: స్పెషల్ చికెన్.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!