/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-10-at-8.24.24-PM.jpeg)
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.
Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం
ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి