/rtv/media/media_files/2025/04/15/DjeFVGO5u8MgEvzHRV3A.jpg)
scientist ashwini
వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది.
Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి
ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.
Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో