Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

టోక్యో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానును ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 49కేజీల విభాగంలో రజతం గెలుచుకున్నారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు.

New Update
_Mirabhai Chanu

టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరా భాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. చైర్‌పర్సన్‌గా నియమించినందుకు వెయిట్ లిఫ్టింగ్ కమిషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన తోటి వెయిట్‌లిఫ్టర్ల వాయిస్ వినిపించేందుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఆమెకు చాలా గర్వకారణమని అన్నారు. అని టోక్యో పతక విజేత మీరాబాయి ఒక ప్రకటనలో తెలిపారు.

మీరాబాయి రెండుసార్లు 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని, 2022లో రజతాన్ని గెలుచుకుంది. మీరాబాయి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకుంది. ఆమెతోపాటు కమీషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత. వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు, పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు. 

#Mirabhai Chanu #Weightlifting Federation #chairperson #Weightlifter
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు