Hulk Hogan: రెజ్లింగ్ కింగ్ హల్క్ హోగన్ హార్ట్ అటాక్ తో మృతి

ఫేమస్ రెజ్లింగ్ లెజెండ్ హల్క్ హోగన్ గుండెపోటుతో మృతి చెందారు. 71 ఏళ్ళ ఈయన ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. 1980, 90లలో హోగన్ ఎన్నో ఛాంపియన్ షిప్ లను గెలుచుకున్నారు. 

New Update
hulk

Hulk Hogan

హల్క్ హోగన్ అమెరికలోని ప్రముఖ స్టార్ లలో ఒకరు. 1980, 90లలో రెజ్లింగ్ ఛాంపియన్ గా పేరు పొందారు. తన బాడీతో ఆ రోజుల్లో జనాల్ని ఉర్రూతలూగించారు. ఈయన అసలు పేరు టెర్రీ జి.బొలియా. అమెరికాలోని జార్జియా లో 1953లో జన్మించారు. ప్రస్తుతం హోగన్ వయసు 71 ఏళ్ళు. ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న ఈ రెజ్లింగ్ ఛాంపియన్ ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆయన కుటుంబసభ్యులు డాక్టర్లను ఇంటికి పిలిపించారు. ఆ తరువాత హోగన్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారు. గుండెపోటు కారణంగా హోగన్ చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. 

ట్రంప్ కు మద్దతు..

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కు హోగన్ మద్దతు పలికారు. ఉత్సాహంగా ప్రచారం లో కూడా పాల్గొన్నారు. ఓ కార్యక్రమంలో షర్ట్ తీసి, టీషర్ట్ చించుకుంటూ ఉద్రేకంగా ప్రసంగించడం అక్కడున్న వారందర్నీ ఆకర్షించింది. ఆయన ప్రసంగం తర్వాత ఇతర సభ్యులతో పాటు ట్రంప్‌ కూడా నిల్చొని చప్పట్లతో హోగన్‌ను అభినందించారు. ఇటీవలే ఈయనకు హార్ట్ ఆపరేషన్ అయింది. దాని నుంచి ఆయన కోలుకుంటున్నారని హోగన్ భార్య స్కై డైలీ చెప్పారు. కానీ కొద్దిరోజుల్లోనే హార్ట్ అటాక్ తో మరణించడంతో ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.  

Also Read: USA: భారతీయులపై అక్కసు..వారిని నియమించుకోవద్దన్న ట్రంప్

Advertisment
తాజా కథనాలు