కుంభమేళకు యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్‌జాబ్స్ భార్య

యాపిల్ కంపెని యజమాని స్టీవ్‌జాబ్స్ భార్య ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళకు హాజరైయ్యారు. స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్‌(61) ప్రయాగ్‌రాజ్ కుంభమేళ కోసం జనవరి 11నే ఇండియాకు వచ్చారు. సోమవారం 40 మంది బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది.

New Update
steev jobs

steev jobs Photograph: (steev jobs)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సంగమంలో కుంభమేళ జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచే కుంభమేళ ప్రారంభమైంది. 45 రోజుపాటు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు పున్య స్థానాలు ఆచరిస్తారు. యాపిల్ కంపెని యజమాని స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్‌(61) ప్రయాగ్‌రాజ్ కుంభమేళ కోసం ఇండియాకు హాజరయ్యారు. ప్రపంచంలో అత్యంత ధనవంతురాలైన మహిళల్లో లారెన్ పావెల్‌ కూడా ఒకరు. 

Read also : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్!

40 మంది సభ్యులతో కూడిన బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది. జనవరి 11నే ఆమె ఇండియా వచ్చారు. ఏండ్ల లారెన్‌.. నిరంజని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి కైలాషానంద శిబిరంలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన ఆమెకు శిబిరం వద్ద స్వామీజీలు ఘనంగా స్వాగతం పలికారు. కాషాయం వస్త్రాలు ధరినంచిన లారెన్‌.. చేతికి రక్షా సూత్ర, మెడలో రుద్రాక్ష మాల ధరించారు. ఆమె ఈ నెల 15 వరకు ప్రయాగ్‌రాజ్‌లోనే ఉంటారు. అనంతరం నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికాకు తిరిగి వెళ్లనున్నారు. ప్రయాగ్‌రాజ్‌ రావడానికి ముందు వారణాసిలోని కాశి విశ్వనాథ ఆలయాన్ని లారెన్ పావెల్‌ సందర్శించారు.

Also Read: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?

Advertisment
తాజా కథనాలు