బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే!

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.  10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  100 పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 పెరిగింది. ముందు రోజు అంటే సోమవారం రోజున బంగారం ధర రూ. 400 పెరిగింది. పూర్తి డీటెయిల్స్ కోసం ఆర్టికల్ లోపల చదవండి.

New Update
Gold

Gold today Photograph: (Gold today )

మకర సంక్రాంతి రోజున బంగారం ధరలు మహిళలకు ఊహించని షాక్ ఇచ్చాయి.  2025 జనవరి 14వ తేదీ మంగళవారం రోజున స్వల్పంగా పెరిగాయి.  10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.  100 పెరిగింది. ఇక   10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 పెరిగింది. దీనికి ముందు రోజు అంటే సోమవారం రోజున రూ. 400 పెరిగింది. దీనికి ముందు వరుసగా రూ. 250, రూ. 350, రూ. 100 చొప్పున పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.  

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.  73 వేల 560 గా ఉండగా..   10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  80వేల 230  గా ఉంది.  ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  73 వేల560గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.80  వేలుగా ఉంది.  

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే..  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  73 వేల 410గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.80  వేలుగా ఉంది.   బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  73 వేల410గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.80వేలుగా ఉంది.  

వెండి ధరల విషయానికి వస్తే

ఇక వెండి ధరల (Silver Rates) విషయానికి వస్తే  ధరల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. కేజీ వెండి పైన ధర రూ. 100 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి ధర లక్ష రెండు వేల రూపాయలుగా ఉంది.  ముంబై, ఢిల్లీ,  కోల్ కత్తాలలో కేజీ వెండి ధర రూ. రూ. 94 వేల 600గా ఉంది. ఇక హైదరాబాద్ ,  చెన్నైలో  ధర  లక్ష రెండు వేల రూపాయలుగా ఉంది.  

గమనిక :   బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు మళ్లీ ధరలు చూసుకోవాల్సి ఉంటుంది.  

Also Read :  రష్యాలో మరో భారతీయుడు మృతి

Advertisment
తాజా కథనాలు