Kedarnath Helicopter crash: షాకింగ్.. కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రమాదం మొదటి వీడియో వైరల్

కేదార్‌నాథ్ హెలికాప్టర్ క్రాష్‌కు సంబంధించిన మొదటి వీడియో బయటపడింది. కొండపై దట్టమైన అడవుల మధ్య ఈ ప్రమాదం జరిగగా ఆ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌తో రికార్డు చేశాడు. ఆ వీడియోలో హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా కనిపించాయి. ఇప్పుడది వైరల్ అవుతోంది.

New Update
Kedarnath Helicopter crash first video viral on social media

Kedarnath Helicopter crash first video viral on social media

కేదార్‌నాథ్ హెలికాప్టర్ క్రాష్‌కు సంబంధించిన మొదటి వీడియో బయటపడింది. ఆ వీడియోలో హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా కనిపించాయి. చుట్టూ మంటలు వ్యాపించి ఉన్నాయి. కొండపై దట్టమైన అడవుల్లో జరిగిన ఈ ప్రమాదాన్ని ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

Kedarnath Helicopter crash

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో 1:23 నిమిషాలు ఉంది. హెలికాప్టర్ ముక్కలు ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చాలా చోట్ల మంటలు చెలరేగుతున్నాయి. వీడియో తీస్తున్న వ్యక్తి ప్రమాద స్థలంలో వారికి సహాయం చేయడానికి ఇతర వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు మాటలు వినబడుతున్నాయి. 

Also read: మణిపూర్‌ వెపన్స్‌ ఆఫరేషన్‌..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం

సమాచారం ప్రకారం.. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 7 మంది మరణించారు. పలువురికి గాయాలైయ్యాయి. మృతుల్లో ఒక బాలిక, ఇద్దరు మహిళలు, పైలట్ రాజ్‌వీర్, ఇతర సిబ్బంది విక్రమ్ రావత్ సహా మరికొందరు ఈ ప్రమాదంలో మరణించారు. ఆర్యన్ కంపెనీకి చెందిన ఈ హెలికాప్టర్.. ఉదయం 5:17 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చార్‌ధామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలను నిషేధించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు