Mytri Movie Makers: పుష్ప–2 షేక్ డైలాగ్స్‌పై  టీమ్ సీరియస్ వార్నింగ్

పుష్ప–2 సినిమాలోనివి వస్తున్న ఫేక్ డైలాగ్స్ మీద మూవీ టీమ్ ఇప్పుడు రెస్పాండ్ అయింది. దీని మీద సీరియస్ అవుతూ వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 

New Update
pushpa-2-hindi

రెండు రోజుల క్రితం పుష్ప–2 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. డిసెంబర్ 4న రాత్రి 9.30కి ప్రీమియర్స్ పడ్డాయి. అప్పటి నుంచి సినిమాలో బాస్ అనే ఒక డైలాగ్ ని మెగాస్టార్ చిరంజీవికి అన్వయిస్తూ మార్చేసిన డైలాగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరుల్ అయ్యాయి. చిరంజీవిని ఉద్దేశించే ఆ డైలాగ్ పెట్టారంటూ వైరల్ చేశారు. దీనిపై కొన్ని ఛానెల్స్ డిబేట్లు కూడా నిర్వహించాయి.రెండు రోజులుగా ఈ డైలాగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ వీటి మీద స్పదించింది. 

చర్యలు తప్పువు..

బాస్ డైలాగ్స్ మీద సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. కొంత ఔత్సాహికులు తమ క్రియేటివిటీని ఉపయోగించి డైలాగ్స్ పుట్టించారు. అవి పుష్ప–2లోనివే అంటూ ప్రచారం చేస్తున్నారు. కావాలనే ఇవన్నీ చేస్తున్నారు. అల్లు అర్జున్, పుష్ప–2 పై నెగిటివిటీని పంచడానికే ఈపనులన్నీ చేస్తున్నారని మైత్రీ మూవీ టీమ్ చెప్పింది. ఇప్పటికైనా ఇలాంటివి చేయడం మానేయాలని...లేకపోతే చట్టపమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి పోస్ట్‌లు పెట్టినా, షేర్ చేసి వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

Also Read: Cricket: సిరాజ్‌ను తిడుతున్న ఆస్ట్రేలియా మీడియా..అసలేమైంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు