/rtv/media/media_files/l1JVRjMeK0AB66qjXv3s.jpg)
ఛత్తీస్‌ఘడ్–తెలంగాణల బోర్డర్ అయిన జీడిపల్లిలో ఈ మధ్యనే కొత్తగా బేస్ క్యాంపును ఏర్పాటు చేసింది హోంశాఖ. ఇక్కడ కొంత పోలీసు బలగాన్ని ఉంచి ఎప్పటికప్పుడు మావోయిస్టు కార్యకలాపాలను అణిచి వేయడమే దీని ఉద్దేశం. అయితే ఈరోజు అదే మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. పీఎల్జీఏ వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు క్యాంపుపై కాల్పులతో విరుచుకుపడ్డారు.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. అయితేయమావోయిస్టుల కాల్పులకుధీటుగా పోలీసులు కూడా ఫైట్ చేస్తున్నారు. ఎదురుదాడి చేస్తూ వారిని చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మావోయిస్టుల కోసం భద్రతా దళాలు కూంబింగ్‌ను కూడా ఉధృతం చేశాయి సీఆర్పీఎఫ్ బలగాలు.
Also Read: శ్రీతేజ్ కుటుంబానికి అండగా 'పుష్ప2' టీమ్.. హాస్పిటల్ వెళ్లిన బన్నీ