Cricket: సిరాజ్‌ను తిడుతున్న ఆస్ట్రేలియా మీడియా..అసలేమైంది?

సరిగ్గా బౌలింగ్ చేయలేదు సరికదా...దానికి తోడు అత్యుత్సాహం చూపించాడు మనోడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యర్థి బ్యాట్ మీదకు బాల్‌ను విసిరాడు సిరాజ్. ఇప్పుడు ఇదే అందరికీ కోపం తెప్పించింది.

New Update
0

ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియాకు, భారత్‌కు మధ్య పింక్ బాల్ టెస్ట్ జరుగుతోంది. ఇందులో ఆసీస్ బ్యాటర్లు దడదడలాడిస్తున్నారు. పింక్ బాల్‌ను అదుపులోకి తీసుకోలేక మన బౌలర్లు సతమతమవుతున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ స్టార్ బౌలర్ సిరాజ్ కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఆ ఫ్రస్టేషన్‌తో ఏం చేయాలో తెలీక తన కోపాన్ని బ్యాటర్ మీద చూపించాడు. 

అసలేం జరిగిందంటే..

మ్యాచ్ జరుగుతున్న సమయంలో సిరాజ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. సహనం కోల్పోయి బ్యాటర్ మీదకు బంతిని విసిరేశాడు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 25వ ఓవర్‌‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌‌లో బంతి సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో లుబషేన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సిరాజ్ బాల్ వేయబోతుండగా..చివరి నిమిషంలో లబుషేన్ ఆగమని చెప్పాడు. బౌలర్ వెనుక ఎవరో వెనుక ఏదో వస్తువు తీసుకువెళుతున్నట్టు అనిపించి వద్దని వారించాడు. కానీ సిరాజ్ మాత్రం బ్రేకుల్లేని బండిలాగ దూసుకెళ్ళిపోయి బాల్ విసిరేశాడు. అయితే లబుషేన్ మాత్రం ఏం చేయలేక క్రీజు నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో మనోడికి బాగా కోపం వచ్చేసింది.  సహనం కోల్పోయి బంతిని వికెట్ల వైపుకు విసిరేశాడు. దీనిపై అప్పుడూ అంపర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా చేయకూడదంటూ సిరాజ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడు.  దీని తరువాత ఈ వీడియో కూడా వైరల్ అయిపోయింది. 

సిరాజ్ చేసిన పని ఇప్పుడు విపరీతంగా విమర్శలు ఎదుర్కుంటోంది.  ఆస్ట్రేలియా మీడియా అంతా విరుచుకుపడుతోంది. అంతే కాదు భారతీయులు సైతం ఈ చర్యను పమర్ధించడం లేదు. ఈమధ్యనే డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సిరాజ్ ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.  వికెట్లు తీసింది లేదు కానీ పొగరు మాత్రం ఉంది అని అర్ధం వచ్చేలా మీమ్స్ చేస్తున్నారు. 

 

Also Read: TS: సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌ పై మావోయిస్టుల మెరుపుదాడి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు