TG News: స్కూల్ బస్ ఘోరం.. బైకర్ స్పాట్ డెడ్! తెలంగాణ పోలీస్ వీడియో వైరల్

ఒక్క క్షణంలో ఊహించని ఘోరం జరిగిపోయేది. దేవుడి దయవల్ల వ్యాన్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి పిల్లలంతా క్షేమంగా ఉన్నారు. తెలంగాణ పోలీస్ షేర్ చేసిన   కింది వీడియో పిల్లలను స్కూల్ బస్సులో పంపే విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి హెచ్చరించింది. 

New Update
miyapur hyderabad incident

miyapur hyderabad incident

TG News: ఒక్క క్షణంలో ఊహించని ఘోరం జరిగిపోయేది. దేవుడి దయవల్ల వ్యాన్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి పిల్లలంతా క్షేమంగా ఉన్నారు. తెలంగాణ పోలీస్ షేర్ చేసిన  ఈ వీడియో పిల్లలను స్కూల్ బస్సులో పంపే విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి హెచ్చరించింది. 

వివరాల్లోకి వెళితే .. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అటుగా నుంచి  వచ్చిన స్కూల్ వ్యాన్ బైక్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇటు బైక్ డ్రైవర్, అటు వ్యాన్ డ్రైవర్ ఇద్దరూ వేగంగా రావడంతో కంట్రోల్ చేయలేక డీకొన్నాయి. అదృష్టవశాత్తు స్కూల్ వ్యాన్ కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పిల్లలంతా క్షేమంగా ఉన్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలపై పిల్లల తల్లిదండ్రులకు, ప్రజలకు అవగాహన కల్పించాలానే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ ఈ వీడియోను ఎక్స్ లో షేర్ చేసింది. 

తెలంగాణ పోలీస్ వీడియో

వీడియోను షేర్ చేస్తూ తెలంగాణ పోలీస్ ఇలా రాసుకొచ్చారు..   "స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు ఎంతో ఓపికతో చాలా నెమ్మదిగా వాహనాలను నడపాలి. అలాంటి నైపుణ్యం కలిగిన  డ్రైవర్లనే స్కూల్ యాజమాన్యం నియమించుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను స్కూల్ వ్యాన్ కి పంపే ముందు వీటిని  ఒకసారి తనిఖీ చేసుకోవాలి" అని తెలిపారు.

ఇదిలా ఉంటే ఇటీవలే స్కూల్ బస్ లకు సంబంధించి విడుదలైన ఓ డేటా ప్రకారం.. హైదరాబాద్ నగరంలో 2500 బస్సులు 15 సంవత్సరాల సర్వీస్ దాటినా ఇంకా రోడ్లపై తిరుగుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రతి ఎనిమిది స్కూల్స్ బస్సుల్లో ఒక బస్సు దాదాపు 15 సంవత్సరాలు దాటిందని.. అలాంటివి మొత్తం 2500 ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో మొత్తం 31,000 స్కూల్స్ ఉండగా... వాటిలో 20,000 హైదరాబాద్ లోనే ఉన్నాయి. గత 9 నెలల్లో స్కూల్ బస్సులు సరైన సర్వీస్ లో లేకపోవడం వల్ల 8 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 5 విద్యార్థులు మరణించగా.. 38 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాదాల విషయంలో RTA ముందస్తు చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వెలువెత్తాయి. బస్సుల ఫిట్నెస్ ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం, ఓవర్ లోడింగ్, రోడ్లపై డ్రైవర్స్ ప్రొటొకాల్స్ పాటించకపోవడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో RTA ముందస్తుగా బస్సులను తనిఖీ చేసి ఉంటే బాగుండేదని ఆరోపణలున్నాయి. 

Also Read: Hyderabad School Buses: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!

Advertisment
తాజా కథనాలు