లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. ఏఆర్ డెయిరీపై కేసు!

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నెయ్యి పంపించే ఏఆర్ డెయిరీపై కేసు నమోదైంది. టీటీడీ అధికారి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. న్యాయ విచారణకు సిద్ధంగా ఉన్నామని డైరీ యాజమాన్యం ప్రకటించింది. 

New Update
dredrerse

Tirumala: తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమలకు నెయ్యి పంపించే ఏఆర్ డెయిరీ (AR Dairy)పై కేసు నమోదైంది. నిబంధనలు పాటించకుండా నెయ్యి సరాఫరా చేశారంటూ టీటీడీ అధికారి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు.. ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. దీనిపై పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ఏఆర్ డెయిరీలో కేంద్ర ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్ ప్లాంట్‌లో నెయ్యి, వెన్న, పెరుగు శాంపిల్స్ సేకరించారు.

కొవ్వు ఆరోపణలు పూర్తిగా అవాస్తవం..

ఇక తిరుపతికి సరఫరా చేసిన నెయ్యిలో జంతు కొవ్వు ఆరోపణలను ఏఆర్ డెయిరీ ఖండించింది. ఇందులో నిజం లేదని చెబుతోంది. న్యాయ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. నెయ్యి తయారీలో ఏ తప్పు చేయలేదని రుజువు అవుతుందని, జూన్, జులైలో తాము పంపిన నెయ్యి మొత్తం ఆలయ అధికారులు వెనక్కి పంపించారని ఏఆర్ డెయిరీ యాజమాన్యం తెలిపింది. తారు స్వచ్ఛమైన నెయ్యినే పంపించామని, నెయ్యిని టెస్ట్ చేసిన రిపోర్టు కూడా లారీలతోనే ఆలయానికి పంపుతామని ఏఆర్ డెయిరీ స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఇష్యూపై భక్తులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు