/rtv/media/media_files/2025/08/29/cm-siddu-2025-08-29-15-32-50.jpg)
ఓట్ల చోరీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక ఆరోపణలు చేశారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధరామయ్య .. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజ్ పాటిల్ చేతిలో ఓడిపోయారు. దానికి ఓట్ల చోరీనే కారణమంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారాయన. కొన్ని పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ పేపర్‌లను దొంగిలించి, తప్పుడు ఓట్లను వేయడమే తన ఓటిమికి కారణమనిఆయన పేర్కొన్నారు. దీనినే ఆయన ఓటు చోరీ అని అన్నారు. ఈ సంఘటనను ఉదహరిస్తూ, ప్రస్తుత ఎన్నికల్లో కూడా ప్రత్యర్థులు ఇలాంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలని సిద్ధరామయ్య సూచించారు.
EXPLOSIVE REVELATION
— SaffronSoul (@TheRealDharm) August 29, 2025
Karnataka CM Siddaramaiah admits he was a victim of electoral fraud by Congress in the 1991 Koppal LS polls
He said he was defeated “ಮೋಸದಿಂದ / by cheating” after 22,000+ votes were mysteriously rejected
Now the same Congress lectures India on Vote Adhikar?
పోలింగ్ బూత్‌ల వద్ద జాగ్రత్తగా ఉండాలి
ముఖ్యంగా, పోలింగ్ బూత్‌ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి అక్రమాలను నిరోధించడానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓ వైపు బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుందోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తోన్న వేళ.. సిద్ధూ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Also Read : Indian Students: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!
సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఎలాంటి అక్రమాలకైనా పాల్పడుతుందని సీఎం స్వయంగా అంగీకరించారని ఆరోపించింది. బీజేపీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. సిద్ధరామయ్య కేవలం గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో అప్రమత్తంగా ఉండాలని తమ కార్యకర్తలకు సూచించారని వివరణ ఇచ్చింది. అయితే, ఈ అంశంపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది.
రాహుల్ గాంధీ బీహార్‌లో యాత్ర
కాగా రాహుల్ గాంధీ ప్రస్తుతం ఓటర్ అధికార్ యాత్ర పేరుతో బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఓటు వేయడం అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్యానికి చాలా కీలకమని ఆయన ఈ యాత్రలో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, ఎన్నికల సంఘం (ECI)పై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. బీహార్‌లో ఓటర్ల జాబితా నుంచి సుమారు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని, వారిలో ఎక్కువమంది బడుగు, బలహీనవర్గాల వారే ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటు చోరీ అనేది ఒక వ్యవస్థీకృత మార్గమని, దీనికి మరిన్ని ఆధారాలు బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు.