/rtv/media/media_files/2025/04/26/zuETQ9I5PMVkHGmYN8NC.jpg)
Kailash Manas sarovor yatra
దాదాపు ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభం కానుంది. కరోనా కారణంగా యాత్రను 2020 నుంచి నిర్వహించలేకపోయారు. ఐదేళ్ల తర్వాత జూన్ 30వ తేదీ నుంచి కైలాస మానస సరోవర్ యాత్రను ప్రారంభించనున్నారు. ఆగస్టు వరకు ఈ యాత్ర కొనసాగనుందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ జైశంకర్ వెల్లడించారు.
ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్!
#KailashManasarovar Yatra organised by the Ministry of External Affairs is to take place from June to August 2025.
— All India Radio News (@airnewsalerts) April 26, 2025
Ministry says this year, five batches, each consisting of 50 Yatris, and 10 batches, each consisting of 50 Yatris, are scheduled to travel through Uttarakhand State… pic.twitter.com/UvmUWNUFoI
ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!
50 మందితో ఐదు బ్యాచ్‌లుగా..
కైలాస మానస సరోవర్ యాత్రను ఈ ఏడాది 50 మంది యాత్రికులతో ఐదు బ్యాచ్‌లుగా వెళ్లడానికి అనుమతి ఇస్తారు. ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ ద్వారా వెళ్తారు. అలాగే ఇంకో 50 మంది యాత్రికులతో ఉన్న 10 బృందాలు సిక్కిం నుంచి నాథు లా పాస్ మీదుగా వెళ్తాయి. అయితే ఈ యాత్రకు వెళ్లే భక్తులు ముందుగానే http://kmy.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. కరోనా కారణంగా 2020 నుంచి ఈ యాత్రను నిర్వహించలేదు. మళ్లీ ఇప్పుడు ఈ యాత్రను ప్రారంభించనున్నారు.
ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్ యూ టర్న్
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లే భక్తులు కుమావున్ మండల్ వికాస్ నిగమ్‌కు రూ.35,000కు బదులుగా రూ.56,000 చెల్లించాలి. ఇందులోనే ప్రయాణీకుల ప్రయాణం, వసతి, ఆహారం మొదలైన అన్ని కూడా అందుతాయి. అయితే ఇవే కాకుండా వైద్య పరీక్షలు, చైనా వీసా, పోర్టర్, టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతం, చైనా సరిహద్దు కోసం ప్రత్యేక ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. ఈ యాత్రను కుమావోన్ మండల్ వికాస్ నిగమ్ లిపులేఖ్ నిర్వహిస్తుంది.
ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం
latest-telugu-news | started | Kailash Manas sarovor yatra