YUVIKA 2026 : స్కూల్ పిల్లలకు ఇస్రో బంపరాఫర్.. గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!

ఫ్యూచర్ లో సైంటిస్టులు కావాలని కలలుగనే స్టూడెంట్ల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చింది. యువిక 2026 పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా

New Update
yuvika

YUVIKA 2026 :  ఫ్యూచర్ లో సైంటిస్టులు కావాలని కలలుగనే స్టూడెంట్ల(students) కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో(isro) ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చింది. యువిక 2026 పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా స్కూలు పిల్లలకు అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై చిన్న వయసులోనే అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కెరీర్ ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు ఇది ఒక గొప్ప వేదిక కానుంది.

ఈ ప్రోగ్రామ్ కోసం 2026 జనవరి 1 నాటికి దేశంలోని ఏదైనా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 31 వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతిభ ఆధారంగా ఏప్రిల్ 13న మొదటి ఎంపిక జాబితాను, ఏప్రిల్ 20న రెండో జాబితాను ఇస్రో విడుదల చేస్తుంది. ఎంపికైన విద్యార్థులకు మే 11 నుండి మే 22 వరకు దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ఇస్రో కేంద్రాలలో శిక్షణ ఇస్తారు.

తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, బెంగళూరులోని యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ వంటి ప్రముఖ వేదికలు ఈ శిక్షణకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్ ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు చిన్న వయసులోనే సరైన దిశానిర్దేశం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం.

Also Read :  కోల్‌కతాలో భూకంపం.. పరుగులు తీసిన జనం... వీడియోలు వైరల్!

విద్యార్థుల టాలెంట్ కు ఎక్కువ

అయితే ఈ ఎంపిక ప్రక్రియలో కేవలం మార్కులే కాకుండా విద్యార్థుల టాలెంట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 8వ తరగతి మార్కులతో పాటు ఆన్‌లైన్ క్విజ్, సైన్స్ ఎగ్జిబిషన్లలో పాల్గొనడం, క్రీడలు, ఎన్సీసీ లేదా స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా పల్లెటూరి స్కూళ్లలో చదివే విద్యార్థులకు అదనంగా 15 శాతం వెయిటేజీ ఇవ్వడం విశేషం.విద్యార్థుల వసతి, భోజనం, చదువుకు కావాల్సిన సామాగ్రితో పాటు ప్రయాణ ఖర్చులను కూడా ఇస్రో తిరిగి చెల్లిస్తుంది. 

శిక్షణ కాలంలో కావాల్సిన స్టడీ మెటీరియల్స్, వసతి, పౌష్టికాహారాన్ని ఇస్రో ఉచితంగా అందిస్తుంది. అంతేకాకుండా, విద్యార్థులు తమ ఊరి నుండి ఇస్రో కేంద్రానికి చేరుకోవడానికి అయ్యే ప్రయాణ ఖర్చులను కూడా సంస్థే తిరిగి చెల్లిస్తుంది. ఒరిజినల్ టిక్కెట్లు సమర్పిస్తే సెకండ్ ఏసీ (2nd AC) రైలు ఛార్జీ లేదా దానికి సమానమైన బస్సు ఛార్జీని రీయింబర్స్ చేస్తారు.

Also Read :  NCERT బుక్‌లో న్యాయ వ్యవస్థపై వివాదం.. కేంద్రం కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు