మన దేశంలో కుంకుమ పువ్వును ఎక్కువగా కశ్మీర్‌లో పండిస్తారన్న సంగతి తెలిసిందే. ఎర్ర బంగారంగా పేరు పొందిన ఈ సుగంధ ద్రవ్యాన్ని వంటలు, ఔషధాలు, సౌందర్య ఉత్పత్తులకు అధికంగా వాడుకుంటారు. అయితే కశ్మీర్‌లో ప్రకృతి అందాలను చూడటానికి వెళ్లిన ఓ రైతు.. అక్కడ కుంకుమ పువ్వు సాగును చూశాడు. దాన్ని చూసి ప్రేరణ పొంది ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి ఇంటి వద్దే పంట సాగు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కుంకుమ పువ్వు కిలో ధర రూ.5 లక్షలు పలుకుతోంది.
Also Read: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా!
ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన అనిల్ జైశ్వాల్ కొన్నేళ్ల క్రితం కుటుంబంతో కలిసి కశ్మీర్‌కు వెళ్లాడు. అక్కడ పంపోర్‌లోని కుంకు పువ్వును సాగు చూశాడు. తన సొంతూరులో కూడా అదే పంటను పండించాలనుకున్నాడు. ఇందుకోసం మట్టి అవసరం లేని అధునాతన 'ఏరోపోనిక్స్' విధానాన్ని ఎంచుకున్నాడు. కశ్మీర్ లాగే ఉష్ణోగ్రత, తేమ, కాంతి, కార్బన్‌డైయాక్సైడ్‌లతో కూడిన నియంత్రిత వాతావరణాన్ని కూడా సృష్టించాడు. అయితే ఆయన తన పంటసాగుకు సంబంధించి మీడియాతో పలు విషయాలు పంచుకున్నాడు.
Also read: తెలంగాణ వచ్చి పదేళ్లైన వలసలు కొనసాగుతున్నాయి: సీఎం రేవంత్
'' మా ఇంటి రెండో అంతస్తులో 320 చదరపు అడుగులున్న గదిలో కుంకుమ పువ్వు సాగును చేపట్టాను. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6.50 లక్షలు ఖర్చు చేశాను. కుంకు పువ్వు మొక్కలను పంపోర్ నుంచి తీసుకొచ్చాను. ఈ సీజన్ ముగిసేలోపు 1.5 కిలోల నుంచి 2 కిలోల వరకు కుంకుమ పువ్వు చేతికొస్తుందని భావిస్తున్నాను. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో దీని ధర కిలో రూ.5 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.8.50 లక్షల వరకు పలికే ఛాన్స్ ఉందని'' అనిల్ జైశ్వాల్ అన్నారు.
Also Read: లెబనాన్‌తో కాల్పుల విరమణ.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం !
Also Read: కుల గణన చేసేది అందుకోసమే.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్