Jharkhand: రేపే జార్ఖండ్ తొలి విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి

జార్ఖండ్‌లో బుధవారం అంటే రేపు  తొలి విడత పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రేపు 15 జిల్లాల్లో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 

New Update
polling

 Jharkhand First Phase Polling: 

జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్‌ను నిర్వహించనున్నారు. మొదటి దశ పోలింగ్ రేపు జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 81 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 1211 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొదటి దశలో 43 స్థానాల్లో 683 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి ఉన్నారు. జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. రెండో విడత నవంబర్ 20న జరగనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న విడుదల అవనున్నాయి. 

Also Read: AP: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

పోలింగ్ ఏర్పాట్లు..

రేపటి మొదటి దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలోని సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అవడం...దాంతో సీఎం మారడం..మళ్ళీ ఆయన జైలునుంచి తిరిగి వచ్చి అధికారాన్ని చేజిక్కుంచుకోవడం ఇలా బోలెడు ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ సారి జార్ఖండ్ ఎన్నికలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక్కడ రెండు దశల్లో ఎన్నికల నిర్వహించనున్నారు. జార్ఖండ్‌ లో ప్రధానంగా జేఎంఎం–ఇండియా కూటమి, బీజేపీల మధ్య అత్యధిక పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో అవినీతి, ప్రజాకర్షక హామీలు, కేంద్ర నిధుల విడుదల లాంటి అంశాలు కీలకంగా నిలిచాయి. 

Also Read: Cricket: పాకిస్తాన్ ఆటగాళ్ళకు భారత్ నో వీసా..

 ఈసారి ఎన్నికల్లో అన్నింటికంటే సీఎం హేమంత్ సోరెస్ అరెస్ట్, అవినీతి ప్రధానాంశాలుగా నిలిచాయి. దీన్ని ఆసరాగా చేసుకుని జేఎంఎం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దాంతో పాటూ ఇక్కడ ఆదివాసీ ఓట్లు ఈసారి చీలే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే హేమంత్ సోరెన్ అరెస్ట్ అయి జైలుకి వెళ్ళినప్పుడు చంపయ్  సీఎం అయ్యారు. కానీ హేమంత్ తిరిగి రాగానే ఆయన తన అధికారాన్ని వదలాల్సి వచ్చింది. దీంతో చంపయ్ పార్టీని వదిలి బీజేపీలో జాయిన్ అయిపోయారు.  తాజా ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో చంపాయీకి ఉన్న ప్రజాదరణ వల్ల ఆ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయని, అది జేఎంఎ-కాంగ్రెస్‌ కూటమిపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read: USA: అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్?

Also Read: మీ తల్లిని చంపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు