వారికి గుడ్‌న్యూస్‌.. ఆ శాఖలో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా జాబ్ చేసుకునే ఛాన్స్!

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో మొత్తం 25 వేల ఉద్యోగాలకు రైల్వేశాఖ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

Job
New Update

భారత రైల్వే శాఖలో ప్రస్తుతం సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో మొత్తం 25 వేల ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త రూల్ ప్రకారం.. సూపర్‌వైజర్ల నుంచి ట్రాక్‌మెన్‌ వరకు ఉన్న వివిధ ఉద్యోగాలకు రైల్వే నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read: ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు!

వీళ్లకు మాత్రమే ఛాన్స్

అయితే 65 ఏళ్ల లోపు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే ఈ అర్హత ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాల వ్యవధికి వీళ్లని నియమించుకోనున్నారు. పదవీ కాలం పొడిగించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రైల్వేశాఖ అన్ని జోనల్ రైల్వే మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పలు మీడియా కథనాలు తెలిపాయి. రిటైర్డ్ ఉద్యోగులు గత ఐదేళ్ల మెడికల్ ఫిట్‌నెస్‌తో పాటుగా పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో వాళ్ల పనితీరు ఎలా ఉండేది అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నియామకాలు చేపట్టనున్నారు. 

Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు.. 

ఆ బెనిఫిట్స్ ఉండవు

గతంలో విజిలెన్స్ గానీ డిపార్ట్‌మెంట్ నుంచి చర్యలు ఎదుర్కొన్న రైల్వే రిటైర్డ్‌ దరఖాస్తుదారులకు అర్హత ఉండదని తేల్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ రిటైర్డ్ ఉద్యోగులు సెలక్ట్ అయితే చివరిసారిగా వారు తీసుకున్న నెలవారీ జీతంలో నుంచి బేసిక్‌ పింఛన్‌ను తొలగించి వేతనం చెల్లిస్తారు. అలాగే ట్రావెల్ అలెవెన్స్‌లు, అధికారిక టూర్ల ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ ఇంక్రిమెంట్ల వంటి బెనిఫిట్స్ వీళ్లకి ఉండవని తెలుస్తోంది. అయితే రైల్వే శాఖలో ప్రస్తుతం సిబ్బంది కొరత నెలకొంది. 

Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

సరిపడా సిబ్బంది లేకపోవడంతో రైలు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్క వాయువ్య రైల్వే జోన్‌లోనే ఏకంగా 10 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా జోన్లలో కూడా పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉంటుందని రైల్వేశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read: స్పెషల్ చికెన్‌.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!

#telugu-news #national-news #indian-railway
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe