Hydrogen Train: త్వరలో ఈ మార్గంలో నీటితో నడిచే హైడ్రోజన్ ట్రైన్‌!

దేశంలో త్వరలోనే హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రానుంది. హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

h2
New Update

Hydrogen Train:ప్రస్తుతం దేశంలో భారతీయ రైల్వేలు...రోజురోజుకి మార్పులు సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే వందే భారత్ రైళ్లు, వందే మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పరుగులు పెట్టబోతున్నాయి. ఇక బుల్లెట్ రైలు ప్రాజెక్టు కూడా శరవేగంగా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరో స్పెషల్ రైలు కూడా అందుబాటులోకి వస్తున్నట్లు సమాచారం.తాజాగా నీటితో నడిచే రైళ్లు పట్టాలు ఎక్కబోతున్నాయి.

Also Read: Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..16 వేల ఉద్యోగాల భర్తీ!

తొలి హైడ్రోజన్ రైలు...

హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. జింద్ నుంచి సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మధ్య ఈ హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 నాటికి దేశ వ్యాప్తంగా 35 రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. డీజిల్, కరెంట్ కాకుండా నీటితో నడవడంతో ఈ హైడ్రోజన్ రైలుతో పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ జరగదని అధికారులు తెలియజేస్తున్నారు. 

Also Read:  Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఈ హైడ్రోజన్ రైలు నీటితో నడుస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్‌లు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. నీటి ఆవిరిని విడుదల చేసే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ హైడ్రోజన్ రైలుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ హైడ్రోజన్ రైలు 40 వేల లీటర్ల నీటిని ఉపయోగించుకుంటుందని సమాచారం.

Also Read:  ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?

ఈ హైడ్రోజన్ రైలు గంటకు గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని పేర్కొన్నారు. దీని శబ్దం కూడా చాలా తక్కువగానే ఉంటుందని.. ఒకసారి ఫ్యూయల్‌ ట్యాంక్‌ నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుందని సమాచారం.

Also Read: Water Bottles: మినరల్‌ వాటర్‌ అమ్మే బాటిళ్లతో కిడ్నీలకు ముప్పు

మొట్టమొదటి హైడ్రోజన్ రైలును హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా పనులు మొదలుపెట్టనున్నారు. ఈ హైడ్రోజన్ రైలును తయారు చేయడానికి ఒక్కదానికి రూ.80 కోట్లు అవుతుందని సమాచారం. అయితే ఈ హైడ్రోజన్ రైలులో టికెట్‌ ధర కూడా భారీగానే ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

#hyderabad #indian-railways #Hydrogen Train #water-powered train #eco-friendly train
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe