Indian railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీ OTT

రైల్వే ప్రయాణాన్ని ఆనందంగా మార్చేందుకు ఇండియన్ రైల్వేస్ రైల్ వన్ అనే యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ లొకేషన్ వంటి సాధారణ సేవలతో పాటు, ఉచితంగా సినిమాలను వీక్షించే అవకాశం కూడా కల్పించారు.

New Update
onerail

ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ట్రైన్ జర్నీలు బోరింగ్‌గా ఫీల్ అయ్యే వారికి ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, అలాగే.. ప్రయాణాన్ని ఆనందంగా మార్చేందుకు రైల్వే సంస్థ ఓ మంచి యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. "రైల్ వన్" అనే పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌లో, టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ లొకేషన్ వంటి సాధారణ సేవలతో పాటు, ఉచితంగా సినిమాలను వీక్షించే అవకాశం కూడా కల్పించారు.

ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసేవారికి ఈ సర్వీస్ మంచి అవకాశం అని చెప్పవచ్చు. ప్రయాణంలో వినోదం కోసం స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటానికి డేటా ప్యాక్‌లు అయిపోవడం, నెట్‌వర్క్ సమస్యలు రావడం వంటి ఇబ్బందులకు ఇది చెక్ పెడుతుంది. ఈ యాప్‌లో ప్రయాణికులకు వివిధ భాషల్లో సినిమాలు, డాక్యుమెంటరీలు, వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. రైలులోని ఉచిత వైఫై సదుపాయాన్ని ఉపయోగించుకుని, ప్రయాణికులు ఈ OTT కంటెంట్‌ను ఫ్రీగా స్ట్రీమ్ చేయవచ్చు.

రైల్ వన్

"రైల్ వన్" యాప్ అనేక రైల్వే సర్వీసులకు అందిస్తుంది. ఇదివరకు టికెట్ బుకింగ్ కోసం ఒక యాప్, అన్-రిజర్వ్డ్ టికెట్ల కోసం మరొక యాప్, భోజనం ఆర్డర్ చేయడానికి ఇంకొక యాప్ ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ అన్ని సేవలు "రైల్ వన్" యాప్‌లో పొందవచ్చు. దీనివల్ల ప్రయాణికులు వేర్వేరు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవసరం ఉండదు, అలాగే వాటి లాగిన్ వివరాలను గుర్తుంచుకోవాల్సిన ఇబ్బందులు తొలగిపోతాయి.

ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. రైల్వే టికెట్ బుకింగ్‌తో పాటు, ప్లాట్‌ఫామ్ టికెట్లు, రైలులో ఫుడ్ ఆర్డర్ చేయడం, రైల్వే సహాయం కోసం "రైల్ మదద్" సేవలను పొందడం వంటివి ఈ యాప్‌‌లో ఈజీగా చేసుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు