/rtv/media/media_files/2025/05/15/YNGgXeafh8OkfFfO6lDR.jpg)
Captain Subhanshu Shukla's space mission
Shubhanshu Shukla ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ప్రయాణం మరోసారి వాయిదా పడింది(ISS Journey Postponed). ఈ ISS ట్రిప్‌తో ఇండియన్ హిస్టరీలో శుభాన్షు శుక్లా ఓ మైలురాయిని క్రియేట్ చేయనున్నారు. ఇండియా తరుపున ISS వెళ్తున్న ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఆయన. యాక్స్- 4 మిషన్‌లో శుక్లా పైలట్‌గా ఉన్నారు. అయితే ఈ ప్రయోగం జూన్ 10 సాయంత్రం 5:52 గంటలకు ప్రారంభించనున్నారు.
Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
యాక్స్-4 ప్రోగ్రామ్ యాక్సియమ్ స్పేస్‌లో భాగం. ప్రస్తుతం శుభాన్ శుక్లా క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన ఆరోగ్య కారణాల వల్ల ఈ అంతరిక్ష ప్రయాణం వాయిదా వేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీరు 14 రోజులు గడపనున్నారు. యాక్సియం-4 పేరుతో చేపడుతున్న ఈ మిషన్‌లో శుక్లాతోపాటు అమెరికా, పోలండ్, హంగరీకి చెందిన ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు.
Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్
1984లో సోయుజ్ T-11 షిప్‌లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ చేసిన మిషన్ గురించి తెలిసిందే. రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం చేసిన మొదటి భారతీయుడు. శుభాన్షు శుక్లా ISSని సందర్శించనున్న మొదటి భారతీయుడు. అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడు కూడా అవుతారు. అంతరిక్షంలో భారత్‌కు చారిత్రాత్మక మైలురాయి ఇది. నిజానికి వీరు గత మే 29నే నింగిలోకి వెళ్లాల్సి ఉంది. కానీ దాన్ని ఈ జూన్ 8కి మార్చారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.
Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్
Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..
/rtv/media/member_avatars/2025/09/12/2025-09-12t124405412z-whatsapp-image-2025-09-12-at-60755-pm-2025-09-12-18-14-07.jpeg )
 Follow Us
 Follow Us