India Population: ఇండియాలో తగ్గుతున్న జనాభా..పెరుగుతున్న అవగాహన

భారతదేశ జనాభా గణనీయంగా తగ్గింది. యూఎన్ నివేదిక ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు భర్తీ స్థాయి కంటే తక్కువగా పడిపోయింది. ఇదొక మంచి సంకేతమని చెప్పింది. భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయిందని నివేదిక ఇచ్చింది.

New Update
population10

ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో భారత్ ఎప్పటి నుంచో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 146 కోట్లతో భారత్ వరల్డ్ హైయ్యెస్ట్ జనాభాలో రెండో దేశంగా ఉంది. అయితే గతంలో కంటే భారత జనాభా గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని తగ్గుదలను చూస్తున్నామని తెలిపింది. 1960 నాటికి, సగటు భారతీయ మహిళకు దాదాపు ఆరుగురు పిల్లలు ఉండగా...అది క్రమేపీ తగ్గుతూ ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరుకు వచ్చిందని నివేదిక ఇచ్చింది. కానీ ఇందులో ఆందోళన చెందాల్సి విషయం ఏమీ లేదని...దీనికి కారణం మహిళల్లో అవగాహన పెరగడమే కారణమని చెప్పింది. 

ఇదొక అద్భుతమైన మైలురాయి..

UNFPA ప్రపంచ జనాభా స్థితి 2025 నివేదిక ప్రకారం, భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయింది.  ఇంతకు ముందు ఇది 2.1గా ఉండేదని తెలుస్తోంది. ఇండియాలో ఇదొక గొప్ప, ముఖ్యమైన మైలు రాయని తెలిపింది. దీనికి కారణం ప్రస్తుతం దేశంలో ఉన్న జనాభా పిల్లల విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారని...వారికి ఎప్పుడు, ఎంత కావాలో చాలా క్లియర్ గా తెలుసునని చెప్పింది. అయితే ఇండియాలో ఇప్పటికీ అతి పిన్న వయస్కులైన జనాభానే అత్యధికంగా ఉందని యూఎన్ తెలిపింది. దాదాపు పావు వంతు మంది 14 ఏళ్ళ లోపే పిల్లలే ఉన్నారని చెప్పింది. దాంతో పాటూ మూడింట రెండు వంతుల మంది పనిచేసే వయసు కలిగిన వారని తేల్చింది. ఇది భారత్ కు చాలా కలిసి వచ్చే అంశమని అంది. దీని వలన దేశాభివృద్ధి అత్యంత వేగంగా పెరిగే అవకాశముందని అంది.

సంతానోత్పత్తి తగ్గుదల రాత్రికి రాత్రే జరిగింది కాదు. ఇది దశాబ్దాల పురోగతి ఫలితం అని చెబుతోంది యూఎన్. బాలికలకు మెరుగైన విద్య, గర్భనిరోధక పద్ధతులపై విస్తృత అవగాహన పట్టణీకరణ, మారుతున్న సామాజిక నిబంధనలు లాంటివి దీనికి దోహదపడ్డాయని తెలిపింది. ఎక్కువ మంది మహిళలు పాఠశాలలో ఉంటూ, ఉద్యోగాలు చేస్తూ, తమ జీవితాల గురించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సాధికారతే నిజంగా మార్పుకు దారితీస్తోందని నిపుణులు అంటున్నారు. 

Also Read: USA-India: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం

Advertisment
Advertisment
తాజా కథనాలు