Sam Pitroda: 'చైనాను శత్రువులా చూడొద్దు'.. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్

చైనాను భారత్‌ శత్రు దేశంగా చూడొద్దని శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది.చైనా విషయంలో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని తెలిపింది. ఆ మాటలు కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబించడం లేదని స్పష్టం చేసింది.

New Update
Sam Pitroda

Sam Pitroda

చైనాను భారత్‌ శత్రు దేశంగా చూడొద్దని కాంగ్రెస్ ఓవర్‌సీస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌ వివరణ ఇచ్చారు. చైనా విషయంలో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని తెలిపారు. ఆ మాటలు కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబించడం లేదని అన్నారు. విదేశాంగ విధానం, భద్రత, ఆర్థికపరంగా చైనా ఇప్పటికీ సవాలుగా ఉన్నట్లు పేర్కొన్నారు.  

Also Read: రైల్వే స్టేషన్‌తో తొక్కిసలాట.. బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్

శామ్‌ పిట్రోడా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాటంలో పెడుతుంటారు. తాజాగా మరోసారి కూడా తన పార్టీ వైఖరికి భిన్నంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్‌.. చైనాను శత్రువులా చూడొద్దని వ్యాఖ్యానించారు. చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందన్నారు. ఆ దేశాన్ని గుర్తించి గౌరవించాల్సిన సమయం వచ్చిందన్నారు.  ఇకనుంచైనా భారత్‌ తన తీరు మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలన్నారు. కేవలం చైనా విషయంలోనే కాదు.. ఇతర దేశాలకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు.

Also Read: ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?

ఇదిలాఉండగా.. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఘర్షణలను నివారించేందుకు సాయం చేస్తామని ట్రంప్‌ ఆఫర్ ఇచ్చారు. అయితే దీన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తిరస్కరించారు. పొరుగు దేశాలతో ఉన్న సమస్యలపై భారత్‌ ఎప్పుడు ద్వైపాక్షిక చర్చలనే మార్గంగా ఎంచుకుంటుందని అన్నారు. ఇలాంటి తరుణంలో చైనాపై పిట్రోడా స్పందించడం చర్చనీయాంశమైంది. పిట్రోడా ఇలా అనడం గాల్వన్‌ అమరవీరులను అవమానించినట్లు కాదా అంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Also Read: పార్లమెంటులో అబద్ధాలు.. ఎంపీకి రూ.9లక్షల జరిమానా

Advertisment
Advertisment
తాజా కథనాలు