/rtv/media/media_files/2025/11/26/smell-2025-11-26-11-39-03.jpg)
సాధారణంగా వాహనాల టైర్ల నుంచి రబ్బరు వాసన వస్తుంది. కానీ ఆ కంపెనీ గులాబీ వాసన వచ్చేలా టైర్లను తయారు చేసింది. ఇందుకు ట్రేడ్ మార్క్ కూడా పొందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రేడ్ మార్క్ లు లోగోలు, లేదా పేర్ల రూపంలో ఇస్తారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఒక సువాసనకు ట్రేడ్ మార్క్ ఇచ్చింది భారత Trade Mark Registry. ఇది సాధించింది ఒక జపాన్ కంపెనీ. ఆ దేశానికి చెందిన సుమిటోమో రబ్బర్ కంపెనీ టైర్లకు గులాబీ వాసనను ట్రేడ్ చేయాలంటూ దరఖాస్తు చేసింది. సుమిటోమోరబ్బర్ఇండస్ట్రీస్ లిమిటెడ్, మార్చి 23, 2023న "ఫ్లోరల్ ఫ్రాగ్రెన్స్ / స్మెల్ రిమినిసెంట్ ఆఫ్ రోజెస్యాస్అప్లైడ్ టు టైర్స్" (“FLORAL FRAGRANCE / SMELL REMINISCENT OF ROSES AS APPLIED TO TYRES”) అనే ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది.దీనికి భారత ట్రేడ్ మార్క్అమికస్ ఆమోదం తెలిపింది.
సాధారణంగా ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. సువాసనను ట్రేడ్ మార్క్ గా నమోదు చేయాలంటే..దాన్ని గ్రాఫికల్ గా చూపించాలని నిబంధన ఉంది.అయితే అలహాబాద్ కు చెందిన ఐఐటీ ప్రొఫెసర్లు దీనిని సాధించగలిగారు.ప్రొఫెసర్లు ప్రీతిష్వరద్వాజ్, నీతేష్పురోహిత్, డాక్టర్ సునీత్ యాదవ్ లు దీని కోసం బాగా కష్టపడ్డారని భారత ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ తెలిపింది. ఈ కృషిని ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ప్రత్యేకంగా ప్రశంసించింది. వీరు ఒక శాస్త్రీయ మోడల్ సహాయంతో గ్రాఫిక్ రూపంలో ఈ సువాసనను తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దాంతో టైర్లకు గులాబీ వాసన ట్రేడ్ మార్క్ ను అమికస్ క్యూరీ రిజిస్టర్ చేయడానికి ఒప్పుకుంది.
చారిత్రాత్మక ఘట్టం..
ఏ వాహనం టైర్లు అయినా రబ్బర్ తోనే చేస్తారు. అవి రోడ్ మీద వెళుతుంటే రబ్బర్ వాసనే వస్తాయి. ఇది గాఢంగా ఉంటుంది కూడా. అయితే ఇప్పుడు ఇవే టైర్లు ఇక మీదట గులాబీ వాసన వెదజల్లనున్నాయి. దీంతో వినియోగదారులే కాదు రోడ్ల మీద ఇతరులకు కూడా గులాబీ వాసన వస్తుంది. ఆ వాసన వలన కంపెనీ పేరు అందరికీ గుర్తిండి పోతుంది. అందుకే ఈ వాసనను ప్రత్యేకమైన దానిగా గుర్తించారు. దీనిని ట్రేడ్ మార్క్ గా రిజిస్టర్ చేయడానికి అనుమతినిచ్చారు. ఈ నిర్ణయంతో సుమిటోమో కంపెనీ ఇప్పుడు తమ టైర్లపై గులాబీ వాసన గుర్తును ముద్రించడానికి రెడీ అవుతోంది.
అంతర్జాతీయంగా యూకే వంటి దేశాల్లో సువాసన ట్రేడ్‌మార్క్‌లు ఉన్నప్పటికీ.. భారతదేశంలో ఇదే మొట్టమొదట సారి కావడంతో ఇదొక ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. పేటెంట్లు, డిజైన్స్ మరియు ట్రేడ్ మార్క్స్ కంట్రోలర్ జనరల్ డాక్టర్ ఉన్నత్ పి. పండిట్ మాట్లాడుతూ.. ఇది భారతదేశంలో ట్రేడ్‌మార్క్ చట్టాల పరిధిని సవాలు చేసే "అరుదైన దరఖాస్తుల వర్గం" కిందకు వస్తుందన్నారు. సువాసన నమోదుకు ఇది మొట్టమొదటి ప్రయత్నమని తెలిపారు.
Also Read: Pak- Afghan: ఆఫ్ఘనిస్థాన్ పై పాక్ దాడి.. తొమ్మిది మంది పిల్లలతో సహా పది మంది మృతి
Follow Us