/rtv/media/media_files/2026/01/13/india-again-rejects-china-claim-over-shaksgam-valley-2026-01-13-20-31-38.jpg)
india again rejects china claim over shaksgam valley
షక్సాగామ్ వ్యాలీపై భారత్, చైనా మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ చైనాకు బిగ్ షాకిచ్చింది. ఈ ప్రాంతం తమ దేశంలోని భాగమేనని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి ఖండించింది. 1963లో పాక్, చైనా మధ్య ఈ వ్యాలీ అప్పగింతకు సంబంధించి జరిగిన ఒప్పందం చట్టవిరుద్ధమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన దీనిపై మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.
Also Read: ట్యాక్స్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు.. ఈ బడ్జెట్ పై ఉన్న 10 టాప్ అంచనాలివే!
1963లో షక్సాగామ్ వ్యాలీని పాకిస్థాన్ అక్రమంగా చైనాకు అప్పగిస్తూ చేసుకున్న ఒప్పందం చెల్లదన్నారు. ఈ ప్రాంతంలో జరిగే ఎలాంటి కార్యకలాపాలను కూడా తాము గుర్తించమని స్పష్టం చేశారు. చైనా-పాక్ ఆర్థిక కారిడార్ విషయంలో ఈ రెండు దేశాలు కలిసి చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యగానే భావిస్తామని తేల్చిచెప్పారు.
ఇదిలాఉండగా షక్సాగామ్ వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై జనవరి 9న భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్-చైనా చెబుతున్న 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని మేము ఎప్పటికి గుర్తించమని తెలిపింది. షక్సాగామ్ వ్యాలీ భారత్‌లో భాగమేనని స్పష్టం చేసింది. భారత్ చేసిన ప్రకటనపై చైనా కూడా స్పందించింది. ఈ ప్రాంతం తమ దేశంలో భాగమేనని.. ఇక్కడ తాము చేపడుతున్న అభివృద్ధి పనులపై భారత్‌కు అభ్యంతరం చెప్పే ఛాన్స్ లేదని తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ వ్యవహారంపై స్పందించారు.
Also Read: టార్గెట్ ఇరాన్...భారత్ పై భారీ ఎఫెక్ట్..75 శాతం తప్పవేమో
షక్సాగామ్ వ్యాలీ అనేది భారత్, పాకిస్తాన్, చైనాల మధ్య ఉన్న ఒక సంక్లిష్టమైన ప్రాంతీయ వివాదం. దీన్ని 'ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్' అని కూడా పిలుస్తారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పాక్ దీన్ని ఆక్రమించుకుంది. ఆ తర్వాత 1963లో దీన్ని అక్రమంగా చైనాకు అమ్మేసింది. వాస్తవానికి భారత్‌కు చెందిన ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఇతర దేశానికి ఇవ్వడం అనేది చట్టవిరుద్ధం. ఈ వ్యాలీని చైనాకు అప్పగించడం వల్ల పాక్‌తో చైనాకు రహదారి సౌకర్యం ఏర్పడింది. దీని నుంచే చైనాకు చెందిన భారీ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు పాక్‌కు రవాణా అవుతున్నాయి.
Follow Us