Ration Mafia: రేషన్ మాఫియాపై ఉక్కుపాదం.. 1010 క్రిమినల్ కేసులు నమోదు! రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటికే అక్రమంగా తరలిస్తున్న 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1010 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. By srinivas 13 Nov 2024 | నవీకరించబడింది పై 13 Nov 2024 15:41 IST in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP News : రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1010 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాదు 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్నామని, అక్రమార్కుల అరెస్టులు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ మళ్ళింపులో కొందరు ఎండీయూల ప్రమేయం కూడా ఉందని, అక్రమ రవాణా జరగకుండా ప్రజల భాగస్వామ్యం అవసరం ఉందని శాసనమండలిలో అన్నారు. Also Read : నాగ చైతన్య కు ఉన్న ఆ అలవాటు వల్లే సమంత విడాకులు ఇచ్చిందా? రేషన్ మాఫియాపై ఉక్కుపాదం.. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే.. కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణం అని మనోహర్ అన్నారు. 'బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1010 కేసులు నమోదు చేయడంతో పాటు 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్నాం. విచారణ అనంతరం అక్రమార్కుల అరెస్టులు తప్పవు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాలో ఎండీయూ ఆపరేటర్ ప్రమేయం ఉన్నట్లు సమాచారం అందింది. కాకినాడలో 13 రైస్ మిల్లులపై గతంలో తనిఖీలు నిర్వహించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: అడ్డంగా బుక్కైన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు నడుపుతూనే దొంగతనం! జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎగుమతి.. పేదలకు అందాల్సిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు చెక్‌పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంస్కరణలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు కలిసి ఎన్ఓసి సర్టిఫికెట్ ఉంటేనే పోర్ట్ అధికారులు బియ్యం ఎగుమతికి అనుమతించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఒక కోటి 48 లక్షల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మంచి పౌష్టికాహారం అందించాలన్నదే ఉద్దేశం అని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం 43 రూపాయల 40 పైసలకు కొనుగోలు చేసి పేద ప్రజలకు అందిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమ రవాణా చేయకుండా ప్రజలు కూడా అడ్డుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. Also Read : రాశీఖన్నా కు బ్రేకప్.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన హీరోయిన్? 1955 సెక్షన్ 6Aఎ కింద కేసులు..రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులపై తనిఖీలు జరుగుతున్నాయని, ఇప్పటికే కృష్ణా, గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలో స్వయంగా తానే తనిఖీలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో అక్రమ రవాణాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాకినాడలో ఈసి చట్టం 1955 సెక్షన్ 6Aఎ కింద మొత్తం 13 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే 51427110 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కొందరు హైకోర్టును ఆశ్రయించడం ద్వారా హైకోర్టు సూచన మేరకు నాన్ పిడిఎస్ రైస్ 26488 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 83 కోట్ల 77 లక్షల బ్యాంక్ గ్యారంటీ తో విడుదల చేయడం జరిగిందన్నారు. ఇది కూడా చదవండి: కలెక్టర్ పై దాడి ఎలా చేశారంటే.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు! ఇపీడీఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండియు ఆపరేటర్ల ప్రమేయం ఉందనని స్పష్టం చేశారు. అందులో భాగంగా కాకినాడ జాయింట్ కలెక్టర్ ఎనిమిది మంది ఎండీయూ ఆపరేటర్లకు జరిమానా విధించడంతో పాటు ఒక ఎండీయూ ఆపరేటర్‌ను తొలగించడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనమండలిలో వివరించారు. #ration #nadendla-manohar #ap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి