/rtv/media/media_files/2025/08/15/modi-2025-08-15-09-25-45.jpg)
Modi
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. దీపావళి పండుగకు జీఎస్టీలో మార్పులు చేస్తామని, దీని ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. జీఎస్టీ వల్ల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఊరట ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత సులభతరం చేయడానికి, పన్నుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై ఈ మార్పులపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Independence Day 2025: ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ప్రధాని మోదీ
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "इस दिवाली मैं आपके लिए डबल दिवाली का काम करने वाला हूं... पिछले 8 वर्षों में हमने GST में बड़ा सुधार किया है...हम नेक्स्ट जनरेशन GST सुधार लेकर आ रहे हैं। सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे..."… pic.twitter.com/oD12FXILQP
— ANI_HindiNews (@AHindinews) August 15, 2025
నెలకు రూ.15 వేలు చొప్పున..
ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా మోదీ 'ప్రధానమంత్రి వికసిత్ భారత్' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యువత కోసం ఇందులో రూ.లక్ష కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎవరికైతే మొదటిసారి ఉద్యోగం వస్తోందో వారికి రూ.15 వేల చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న భారత్ ప్రస్తుతం స్వయం సమృద్ధి దిశగా నడుస్తోంది. ఒకప్పుడు తిండికి ఇబ్బంది పడిన దేశం నేడు ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. అన్ని రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోందని అన్నారు. అలాగే త్వరలో మేడిన్ ఇండియా చిప్‌లు కూడా మార్కెట్‌లో వస్తాయని మోదీ తెలిపారు. మేకిన్ ఇండియా అంటే ఏంటో ఆపరేషన్ సిందూర్ తెలిపింది.
आज 15 अगस्त के दिन, हम देश के युवाओं के लिए एक लाख करोड़ रुपये की योजना शुरू कर रहे हैं। आज से ‘प्रधानमंत्री विकसित भारत रोजगार योजना’ लागू हो रही है। इसके तहत निजी क्षेत्र में पहली नौकरी पाने वाले बेटे-बेटियों को सरकार 15,000 रुपये देगी: PM @narendramodi#IndependenceDay2025pic.twitter.com/yQSEZ6DSAP
— SansadTV (@sansad_tv) August 15, 2025
ఇది కూడా చూడండి: Indipendence Day Special: దేశానికి స్వాతంత్రం వచ్చినా..హైదరాబాద్ మాత్రం చీకట్లోనే...ఎందుకో తెలుసా?