/rtv/media/media_files/2025/08/15/independence-day-celebrations-2025-08-15-07-35-45.jpg)
పద్రాగస్ట్‌ను పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణం మువ్వన్నెల జెండాలతో నిండిపోయింది. ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కారించారు. ఈఏడాది 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నయా భారత్ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటకు చేరుకోక ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఆవిష్కరించడం వరుసగా ఇది 12వసారి. ఈ వేడుక కోసం ఎర్రకోట పరిసరాల్లో 11 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 3 వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నారు. రాజధాని ఏఐ మోడ్ సీసీటీవీ సర్వేలెన్స్‌లో ఉంది. ‘నయా భారత్’ ఇతివృత్తంతో ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
VIDEO | Independence Day 2025: PM Narendra Modi (@narendramodi) pays floral tribute to Mahatma Gandhi at Rajghat.
— Press Trust of India (@PTI_News) August 15, 2025
He will address the nation from the ramparts of historic Red Fort for the 12th consecutive time.
(Source: Third Party)
(Full video available on PTI Videos -… pic.twitter.com/AaDLzrZmcc
అనంతరం ఎర్రకోటకు చేరుకొని త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. జాతినుద్దేశించి ప్రసంగిసస్తున్నారు
PHOTO | 79th Independence Day: PM Modi (@narendramodi hoists Tricolour at the iconic Red Fort.#IndependenceDay2025pic.twitter.com/dfalTqvH19
— Press Trust of India (@PTI_News) August 15, 2025
#WATCH | Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort. #IndependenceDay
— ANI (@ANI) August 15, 2025
(Video Source: DD) pic.twitter.com/UnthwfL72O
ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం..
79వ స్వతంత్య్ర దినోత్సవ వేడుకలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశ ప్రజలందరికీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది 140 కోట్ల భారతీయుల సంకల్ప పండుగ అని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేసి భారత్‌ను ఏకం చేశామని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. 100 కిలో మీటర్లు శత్రుదేశంలోకి వెళ్లి శత్రువులను మట్టుబెట్టిన భారత్ బలగాలను మెచ్చుకున్నారు. శుత్రువులు ఊహించని విధంగా దెబ్బకొట్టామని వివరించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే ఎవరికైనా అందుకు సరైన గుణపాఠం తప్పదని అన్నారు. పాక్ అణు బెందిరింపులు సహించేది లేదని మోదీ పునరుద్ఘటించారు.