/rtv/media/media_files/2025/11/20/nithish-2025-11-20-11-45-00.jpg)
బీహార్ కొత్త ప్రభుత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అయినప్పటికీ మంత్రుల శాఖల్లో మాత్రం పెద్ద మార్పులే చోటు చేసుకున్నాయి. దాదాపు 20 ఏళ్ళపాటూ తన దగ్గర ఉంచుకున్న హోంశాఖను ఈ సారి మాత్రం నితీశ్ వదులుకున్నారు. అత్యంత కీలకమైన ఈ శాఖను ఈ సారి బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి చేజిక్కించుకున్నారు. దీనికి సంబంధించి నిన్న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. మరో డిప్యూటీ సీఎం , బీజైపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు రెవెన్యూ, భూసంస్కరణలు, భూగర్భ గనుల శాఖను అప్పగించారు. సీఎం నితీశ్ దగ్గర మాత్రం సాధారణ పరిపాలన విభాగం, క్యాబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ లాంటి శాఖలు మాత్రమే ఉన్నాయి.
మొత్తం మార్చేశారు..
బీహార్ లో ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర నుంచీ బీజేపీ పట్టుదలగానే ఉంది. ఈ షారి ెలా అయినా గెలవడంతో పాటూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలనే అనుకుంది. అసలు ముఖ్యమంత్రి పదవినే కోరుతుంది అనుకున్నారు అంతా. కానీ దాన్ని మాత్రం నితీష్ కుమార్ కే ఇచ్చేసింది. కానీ కీలక శాఖలను మాత్రం దక్కించుకుంది. దేశంలో వరుసగా మూడోసారి ఎన్డేయే ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే బీజేపీకి తక్కువ మెజారిటీ రావడంతో జేడీయే, టీడీపీ సపోర్ట్ తో గవర్నమెంట్ ను ఫామ్ చేసింది. దాంతో పాటూ కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం..మరి కొన్ని చోట్ల బీజేపీ సపోర్ట్ ఉన్న పార్టీలు ప్రభుత్వంలో కీలకంగా ఉండడం లాంటి జరిగాయి. అప్పటి నుంచి అన్ని చోట్లా తమ ప్రభుతవాలే రావాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఒకవేళ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా..కీలక శాకలను తమ చేతిలోనే ఉంచుకోవాలని డిసైడ్ అయింది. మహారాష్ట్రలో కూడా అదే చేసింది. ఇప్పుడు బీహార్ లో కూడా అదే జరిగింది.
బీహార్ లో జేడీయూ పార్టీ చాలా బలంగా ఉంటుంది. దాన్ని డామినేట్ చేయడం బీజేపీకి చాలా కష్టమైన పని. తేడా వస్తే నితీశ్ కుమార్ కూటమినే వదిలేసే ప్రమాదం ఉంది. అందుకే అలాంటి రిస్క్ లను బీజేపీ తీసుకోలేదు. సీఎం పదవిని నితీశ్ కే వదిలేసింది. కానీ కీలక పదవులను మాత్రం తనకు వచ్చేలా చూసుకుంది. మరోవైపు జేడీయూతో పొత్తు పెట్టుకున్న ప్రతీసారీ బీజేపీ తన చేతిలో ఉంచుకునే ఆర్థికశాఖను మాత్రం ఈసారి మాత్రం జేడీయూకే కేటాయించారు. ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖలను జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌కు అప్పగించారు. జేడీయూ సీనియర్ నేత శ్రోవన్ కుమార్‌కు గ్రామీణాభివృద్ధి, రవాణాశాఖ కేటాయించగా.. అదే పార్టీకి చెందిన అశోక్ చౌదరికి గ్రామీణ పనుల విభాగం శాఖను కేటాయించారు. జేడీయూ నేత విజయ్ చౌధరికి భవన నిర్మాణం, జలవనరులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు అప్పగించగా.. మదన్ సాహ్నీకి సాంఘిక సంక్షేమ మంత్రిత్వశాఖను కేటాయించారు.
Also Read: Tejas Fighter Jet: తేజస్ యుద్ధ విమానాల ప్రత్యేకత ఏంటి? నిన్న ప్రమాదానికి కారణాలేంటి?
Follow Us