AP: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ..హైటెన్షన్

కాకినాడ జిల్లాలో  హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.  అక్కడి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.  వైస్ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ, వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఎన్నిక ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది.

author-image
By Manogna alamuru
New Update
tension

High Tension At Tuni

తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వైస్ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ-వైసీపీ ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు చలో తుని పేరుతో వైసీపీ ఈరోజు బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో రాజానగరంలో జక్కంపూడి రాజా ఇంటి దగ్గర ఉధృతి నెలకొంది. దీంతో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. తుని వెళ్ళొదద్దంటూ ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో వైసీపీ నేతలకు, పోలీసులకూ మధ్య  వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అలాగే చైర్మన్ సుధారాణి ఇంటికి భారీగా చేరుకుంటున్న వైసీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. మాజీమంత్రి కన్నబాబు, ముద్రగడ, వంగా గీతా, ద్వారంపూడిలను పోలీసులు  హౌస్ అరెస్ట్ చేశారు. 

తునిలో 144 సెక్షన్ అమలు..

ఇప్పటికే తుని మున్సిపల్ వైస్ ఛైర్మప్ ఎన్నికలుమూడుసార్లు వాయిదా పడ్డాయి. ఇక్కడ వైసీపీకి 18 మంది, టీడీపీకి 10 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీల మధ్యనా తీవ్ర పోటీ నెలకొంది.  మరోవైపు తునిలో సెక్షన్ 144 అమలు, ర్యాలీలకు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు.  మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163(2) బీఎన్ఎస్ఎస్ చట్టం అమలు పర్చారు. ఐదుగురు వ్యక్తు కంటే ఎక్కువ గుమికూడద్దని ఆంక్షలు పెట్టారు. అలాగే ఆయుధాలు, కర్రలు, రాళ్లు, అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువులు, ఇతర ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని నిషేధించారు. ఈరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. 

నిన్న జరగాల్సిన తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. ఉదయం 11గంటలకు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగాల్సి ఉండగా, వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా ఆ పార్టీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ ఇంట్లో నిర్బంధించారు. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. అందుకే ఈరోజు అయినా ఎన్నికల జరుగుతుందో లేదో అని అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

Also Read: Hydra: అక్కడ ప్లాట్లు కొంటే పాట్లు తప్పవు...హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు