Russia-Ukraine War : నేనొక మూర్ఖున్ని...కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పుడు భారత్ దాన్ని ఖండించాలని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్ పిలుపునిచ్చారు. ఆ విషయమై రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం  మొదలైన సమయంలో భారత్‌ వైఖరిని విమర్శించి తానొక మూర్ఖుడిలా మిగిలానని శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
Shashi Tharoor

Shashi Tharoor

 Russia-Ukraine war :  2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పుడు భారత్ దానిని ఖండించాలని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్ పిలుపునిచ్చారు.  ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం  మొదలైన సమయంలో భారత్‌ వైఖరిని విమర్శించడం తన మూర్ఖత్వమని అలా మాట్లాడి తానొక మూర్ఖుడిలా మిగిలానని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతి తీసుకొచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉందన్నారు.

ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్

Russia-Ukraine War

 ‘‘యూఎన్ ఛార్టర్‌లోని ఆదర్శాలు ఆ రోజు నా వాదనకు కారణం. అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించేందుకు బలాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకించిన చరిత్ర భారత్‌ది. అంతర్జాతీయ సరిహద్దులు, సార్వభౌమత్వాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే.. మన దేశం దానిని ఖండించాల్సిందే. అయితే ఆరోజు భారత్ ఒక స్టాండ్ తీసుకోలేదని నేను విమర్శించాను.  ఈ విషయంలో మూడు సంవత్సరాల తర్వాత నేను మూర్ఖుడిలా మిగిలాను. ఎందుకంటే మూడు సంవత్సరాల తర్వాత భారత వైఖరి చెల్లుబాటు అయింది. మన ప్రధాని రెండు వారాల వ్యవధిలో ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులను ఆలింగనం చేసుకున్నారు. రెండుచోట్లా ఆమోదం పొందారు. చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే, శాశ్వత శాంతి తీసుకొచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉంది. యూరప్‌ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడం వల్ల భారత్ అనేక ప్రయోజనాలు పొందుతోంది’’ అని శశిథరూర్ అన్నారు.

ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

 గతంలోనూ భారత విదేశాంగ విధానాన్ని థరూర్ ప్రశంసించారు. ‘నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే మోదీజీ 27 దేశాల్లో పర్యటించారు. అయితే, వాటిలో ఒక్కటి కూడా ఇస్లామిక్‌ దేశం లేదు. కాంగ్రెస్ ఎంపీగా నేను దాన్ని తప్పుబట్టాను. అయితే, ఆ తర్వాత ఆయన చేసిన పనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇస్లామిక్‌ దేశాలకు ఆయన చేరువైన తీరు ఆదర్శప్రాయమైంది. గతంలో ఇస్లామిక్‌ దేశాలతో మన దేశానికి ఇంతటి మెరుగైన సంబంధాలు లేవు. అప్పుడు నేను చేసిన విమర్శలను ఉపసంహరించుకుంటున్నాను’’ అని కొనియాడారు.

ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

ఇదిలాఉంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తొలి నుంచి స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. ఇది యుద్ధాల యుగం కాదంటూ.. ఎలాంటి వివాదాన్నైనా చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించాలని సూచనలు చేసింది. అలాగే తనవంతు శాంతి ప్రయత్నాలు చేసింది. అటు రష్యాలోనూ, ఇటు ఉక్రెయిన్‌లోనూ పర్యటించి.. పుతిన్‌, జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ భేటీ అయి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే తాజాగా థరూర్ ప్రస్తావించారు.
అయితే కాంగ్రెస్‌ కు దూరమవుతున్నాడన్న ప్రచారం సాగుతొన్న వేళ శశిథరూర్‌ ప్రధానిని ప్రశంసించడం చర్చనీయంశమైంది. బీజేపీకి దగ్గరవడం కోసమే ఆయన ప్రధానిని పదే పదే పొగుడుతున్నాడన్న వాదన వినపడుతోంది.

ఇది కూడా చూడండి: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు

శశిథరూర్ ఇటీవల ఒక ఆర్టికల్‌లో కేరళ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ప్రధానమంత్రి అమెరికా పర్యటనపై సైతం ప్రశంసలు కురిపించారు. వీటిపై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై థరూర్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, తాను 16 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రభుత్వంలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఇతర పార్టీల ప్రభుత్వం ఉన్నా మంచి పనులు చేస్తే ప్రశంసించడం, తప్పు చేస్తే నిలదీయడం తన నైజమని చెప్పారు.  

Also Read: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు