ఛత్తీస్‌ఘడ్‌కు నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌పై హైలెవెల్ మీటింగ్ నిర్వహణ క్రమంలో మూడు రోజుల పాటు ఛత్తీస్‌ఘడ్‌లోనే పర్యటించనున్నారు. మావోయిస్టుల అతి తీవ్ర ప్రభావిత ప్రాంతం అయిన బస్తర్ రేంజ్‌లో పర్యటిస్తారు కేంద్రహోంమంత్రి అమిత్ షా. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడ్వి హిడ్మా స్వగ్రామంలోని భద్రతా బలగల బేస్ క్యాంపులోనే రోజంతా బసచేయనున్నారు. వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలకడమే లక్ష్యంగా అమిత్ షా మూడు రోజులు పర్యటించనున్నారు. ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం మూడు నెలలకు ఒకసారి రివ్యూ.. సెక్యురిటీ ఫోర్సెస్ అత్యున్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మావోయీస్టు ప్రభావిత ప్రాంతాల్లో స్థితిగతులు, కార్యచరణపై ప్రతీ మూడు నెలలకోసారి హోంమంత్రి రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆగస్టులో నిర్వహించిన సమీక్ష సమావేశం తర్వాత లొంగిపోవాలని లేకపోతే భయంకర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుందని మావోయిస్టులను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు అమిత్ షా జారీ చేశారు. ఇటీవల మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల అమిత్ షా ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే! గడిచిన మూడు నెలల్లో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో జరిగిన యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌పై నివేదికను అమిత్ షాకు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి అందజేశారు. గత రివ్యూ అనంతరం బస్తర్ రేంజ్ పరిధిలో మొత్తం 18 యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌ను భద్రతాబలగాలు జరిపాయి. మూడు నెలల్లో బస్తర్ వ్యాప్తంగా 66 మంది మావోయిస్టులు హతమయ్యినట్లు సమాచారం. అలాగే 195 మందిని అరెస్ట్ చేయగా మరో 177 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. దంతెవాడ జిల్లాలో సింగిల్ ఆపరేషన్‌లో అత్యధికంగా 33 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టారు. ఈ ఏడాది ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర వ్యాప్తంగా 214 మంది మావోయిస్టులను ఎదురుకాల్పుల్లో భద్రతాబలగాలు చంపారు. ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి అబూజ్మడ్ సహా అన్ని ప్రాంతాల్లో భద్రతాబలగాలు పట్టుబిగిస్తున్నారు. 2026 మార్చి కల్లా దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. హై లెవెల్ మీటింగ్ తర్వాత ఛత్తీస్‌ఘడ్ సెక్యూరిటీ ఫోర్సెస్‌తో కలిసి అమిత్ షా లంచ్ చేయనున్నారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో మరణించిన జవాన్లకు అమిత్‌షా నివాళులు అర్పించనున్నారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి కార్యాక్రమాలపై ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో కలిసి చర్చించనున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌ఘడ్‌లో భద్రతాబలగాలను హైఅలెర్ట్ ప్రకటించారు. ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్