Ap: ఆంధ్రాలో  ప్రధాని మోదీ పర్యటన..5 కి.మీ పరిధిలో నో ఫ్లై జోన్

ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 6500 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. సభ జరిగే ప్రాంతం నుంచి 5 కి.మీ పరిధి, గన్నవరం ఎయిర్ పోర్ట్ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. 

New Update
AP

Modi Visit

ప్రధాని మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరో మైలురాయి నేడు ఆవిష్కృతమవుతోంది. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా నేడు అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో మొత్తం 6500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. సభ జరిగే ప్రాంతానికి 5 కి.మీ. పరిధిని నోఫ్లై జోన్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. మోదీ పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్‌ ఎగురవేయడానికి కూడా అనుమతి లేదు. గన్నవరం ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కలా ఇవే నిబంధనలు అమలు అవుతాయి. పహల్గాం దాడి తర్వాత ప్రధాని పర్యటనపై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు అధికారులు. 

అన్ని ఏర్పాట్లు పూర్తి..

ప్రధాని మోదీ తిరువనంతపురం నుంచి గన్నవరం వస్తారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్ లో అమరావతికి చేరుకుంటారు. దీని కోసం ఇప్పటికే నాలుగు హెలికాఫ్టర్లు విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లేలా రెండు మార్గాలను ఎంపిక చేశారు. విమానాశ్రయం నుంచి చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపైకి వచ్చి కేసరపల్లి - గూడవల్లి - ఎనికేపాడు - రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తారు. బెంజిసర్కిల్, ప్రకాశం బ్యారేజి, ఉండవల్లి కరకట్ట మీదుగా రాజధానికి వెళ్తారు. భద్రత కోసం 6,500 మంది సిబ్బందిని నియమించారు. పర్యవేక్షణ కోసం 37 మంది IPS అధికారులను నియమించారు. వారికి సహాయంగా ట్రైనీ IPSలను కేటాయించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఇప్పటికే వేదికతో పాటు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేశారు.

today-latest-news-in-telugu | amaravathi | pm modi

Also Read: USA: ఎన్ఎస్ఏ సలహాదారు మైక్ వాల్జ్ పై వేటు

Advertisment
తాజా కథనాలు