/rtv/media/media_files/2025/05/11/lv8yu5NQ9GnE5IbysSHd.jpg)
Mothers day
చల్లని వెన్నెలనిచ్చే జాబిలమ్మలా
దాహం తీర్చే జల దేవతలా
పసిడి పంటలను పండించే పుడమితల్లిలా
కీడు చేసే వారికీ మేలు చేసేలాంటి
సహృదయం గలది మాతృ హృదయం!
Happy Mother's Day 2025: అమ్మంటే అందరికీ ఇష్టం. అంతులేని అనురాగం, అలుపెరుగని ఓర్పు అమ్మ సొంతం. ప్రతి మనిషికి మొదటి గురువు అమ్మనే. తను తిన్నా తినుకున్నా బిడ్డల కడుపు చూసి ఆకలితీర్చేది అమ్మ. అమ్మకు మనం తిరిగి ఏమివ్వగలమో తెలియదు కానీ, ప్రతి బిడ్డకు తన తల్లిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం. ఈ రోజున మీ హృదయంలోని ప్రేమానురాగాలను, మీ శ్రద్ధను తెలిపే కొన్ని అందమైన, మనసుకు హత్తుకునే మాటలు మీ అమ్మకు పంపించి ఆమె కళ్ళల్లో ఆనందం చూడండి. మదర్స్ డే శుభాకాంక్షలను అలా ప్రేమగా చెప్పండి.
పుట్టినప్పుటి నుంచి జీవితంలోని ప్రతి అడుగులోనూ తోడుండే అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజు మదర్స్ డే. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 11న ఈ ప్రత్యేకమైన రోజు వస్తోంది. అమ్మ ప్రేమను కొనియాడే మధురమైన రోజు ఇది. అమ్మ మన కోసం వెచ్చించిన ప్రతి క్షణం, చేసిన ప్రతి త్యాగం, భరించిన ప్రతి కష్టం... వాటిని గుర్తుచేసుకునే పవిత్రమైన సందర్భం ఇది. నిజానికి అమ్మ ప్రేమకు ఈ ప్రపంచంలో ఏదీ సాటి రాదు. ఆ ప్రేమను పొగిడేందుకు మాటలు కూడా చాలవు.
ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి
సృష్టిలో కమ్మనైన పదం అమ్మ. బిడ్డను తన గర్భంలో నవమాసాలు.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బిడ్డకు జన్మనిచ్చి.. ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తన పిల్లల భవిష్యత్ కోసం, వారి ఎదుగల కోసం అమ్మ చేసే త్యాగాలు అనంతరం. ఇంట్లో నలుగురు ఉండి.. ముగ్గురికి మాత్రమే సరిపడే ఆహారం ఉంటె.. తాను తిన్నాను అంటూ.. కుటుంబ సభ్యుల కడుపునింపేదే అమ్మ. ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ.. అటువంటి అమ్మని స్మరించుకుంటూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఒక్కోరోజు మాతృదినోత్సవంను జరుపుకుంటారు.
ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
ఉగ్గుపాలు పోసినప్పటి నుంచి.. తన కాలిపై స్వతహాగా నిలబడేంత వరకు బిడ్డను కంటికి రెప్పలా చూసుకునే అమ్మ గొప్పదనాన్ని స్మరించుకోవడం అంటే అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకోవడమే. అలాంటి అమ్మకు ఎమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఎందరో గాయకులు, కవులు అమ్మ గొప్పదనాన్ని వెలుగెత్తి చాటారు. అయితే నేటి ప్రపంచంలో అమ్మను చూసుకోవడం భారంగా భావించేవారు లేకపోలేదు. మనల్ని కంటికి రెప్పలా చూసుకునే తల్లికి వయస్సు పైబడితే భారంగా భావించి... వృద్ధాప్య ఆశ్రమంలో వదిలిపెట్టేయడం సహజమైంది. ఆధునికత పెరుగుతున్న కొద్దీ మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అలాంటి వారు మీరైతే అమ్మకు ప్రాధాన్యమివ్వండి.. అప్పుడే మీ పిల్లలు మీకు ప్రాధాన్యమిస్తారు. లేకుంటే అమ్మకు ఏర్పడిన గతే భవిష్యత్తులో మీకు ఏర్పడక తప్పదని గుర్తించాలి. అమ్మ.. నిర్వచనానికి అందని పదం. వేలకోట్ల భావాలకు ప్రతిరూపం. జీవాన్ని, జీవితాన్ని ఇవ్వడమే కాదు..జీవితకాలపు ప్రేమైక మమకారాన్ని పంచడంలో తల్లిని మించి ఎవరూ వుండరు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?
అమ్మ అనే పలుకు తీయదనం
అమ్మ అనే భావన ఇచ్చే భరోసా
ప్రపంచంలో మరేశక్తీ ఇవ్వదు. ఇవ్వలేదు.
కష్టాలకొలిమిలో కాలిపోతూ కూడా సుఖాల పొత్తిలిలో హత్తకుని రక్షించేది తల్లి మాత్రమే. జీవనసుడిగుండంలో చిక్కుకున్నా.. తన కొంగుచాటున బిడ్డల్ని నిలిపి వారి భవిష్యత్తు కోసం తపించేది మాతృమూర్తి మాత్రమే. బిడ్డ ఆకలి తీర్చడానికి తన రక్తాన్ని స్తన్యంగా అందించి.. ఆనందించే దైవ రూపం. అయితే, కంటేనే తల్లి అని అనుకోవడానికి లేని అనేక సంఘటనలు నిత్యం మనం చూస్తుంటాం. తనకు సంబంధంలేని వ్యక్తి ఆకలిని తీర్చడానికిీ తను తినకుండా కూడా అహారాన్ని ఇచ్చే తల్లులు ఎందరో. 'మాతృదేవోభవ' సూక్తికి నిజమైన తెర రూపం! కటిక పేదరికంలోనూ కూలి పనితో బిడ్ఢల కడుపునింపే అమ్మలెందరో.. తన ఆరోగ్యం కుంటుపడినా.. పిల్లల ఆరోగ్యం కోసం పరితపించే మాతృమూర్తులకు లెక్కేలేదు.. కొలవలేనిది..తరిగిపోనిది.. రుణం తీర్చుకోలేనిది అమ్మ ప్రేమ ఒక్కటే! అమ్మ కోసం జీవితాన్ని ఆమె పాదాల ముందు పరచినా సరిపోదు. కానీ, అమ్మకు ఒక కృతజ్ఞత.. తల్లి త్యాగానికి ఓ వందనం.. అన్నిటికీ మించి తరగని అమ్మ ప్రేమ గుర్తులు నిండిన హృదయంతో ఓ మాతృమూర్తి..నీకిదే నమస్సుమాంజలి అంటూ ప్రపంచం అంజలి ఘటించే మదర్స్ డే సందర్భంగా అమ్మకు వందనం.
పురిటి నొప్పులను పంటి బిగువుతో భరిస్తూ ...పొత్తి కడుపులో నీవు తన్నే తన్నులను ఆనందంగా అనుభవిస్తూ...నీ తొలి కేకకై నిరీక్షిస్తూ...తాను పునర్జన్మను పొంది..నీకు జన్మను ప్రసాదించే ప్రతి సృష్టికర్త అమ్మ .గుడి లేని దైవంగా అమ్మను పుట్టించాడు బ్రహ్మ! అమ్మ హృదయం..అమృతపు గని ..మమతను పంచడమే ఆమె పని!..తాను తిన్నా తినకున్నా నీకు మస్తుగా పెట్టి తాను పస్తులుంటుంది.తాను పడ్డ కష్టాలు నీవు పడకూడదని..అందరి కన్నా మిన్నగా నీవు ఉండాలని..హృదయ పూర్వకంగా ఆకాంక్షించే అమృతమూర్తి అమ్మ..ఆమె సేవతోనే తరిస్తుంది ఈ మానవ జన్మ!
ఇది కూడా చూడండి:India On Ceasefire: ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
మాతృ దినోత్సవ వెనుక కథనం..
తల్లులను గౌరవించే సంప్రదాయం పురాతన కాలం నుండి ఉన్నప్పటికీ, మదర్స్ డే జరుపుకునే భావన అమెరికాలో ఉద్భవించింది. ఈ దినోత్సవ వేడుకలను 1907 సంవత్సరంలో, అమ్మని స్మరించుకోవాలనే ఆధునిక భావన పుట్టింది. యునైటెడ్ స్టేట్స్‌లో మదర్స్ డే జరుపుకోవాలనే కోరిక మొదట రచయిత జూలియా వార్డ్ హోవే, అన్నా జార్విస్ అనే ఇద్దరు మహిళలకు పుట్టింది. వారు తమ తల్లి ఆన్ రీవ్స్ జార్విస్ జ్ఞాపకార్థం ఆ రోజును ప్రారంభించారు.వెస్ట్ వర్జీనియాలోని గ్రాఫ్టన్‌లోని ఆండ్రూస్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్‌లో మొదటి మదర్స్ డే దినోత్సవాన్ని అన్నా జార్విస్ జరుపుకున్నారు. ఆన్ రీవ్స్ జార్విస్ ఒక సామాజిక కార్యకర్త, ఆమె అమెరికన్ అంతర్యుద్ధంలో గాయపడిన సైనికులను చూసుకుంది, ఆరోగ్యం , శాంతి కోసం చాలా కృషి చేసింది. , ఆమె మరణం తరువాత, అన్నా తన తల్లి సేవ , త్యాగాలను గౌరవించటానికి మదర్స్ డేను ప్రారంభించింది. మదర్స్ డే వేడుకలకు పునాది వేసింది అన్నా జార్విస్, కానీ మదర్స్ డేను అధికారికంగా మే 9, 1914న అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ప్రారంభించారు. ఈ సమయంలో, US పార్లమెంట్‌లో ఒక చట్టం ఆమోదించబడింది , ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం మాతృ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. అప్పటి నుండి, అమెరికా, యూరప్ , భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో మదర్స్ డే జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ రోజు ఎంచుకోవడానికి కారణం సాధారణంగా అందరికీ ఆదివారం సెలవు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో, ముఖ్యంగా తమ తల్లితో సమయం గడపవచ్చనే ఉద్దేశ్యంతో ఈ రోజును ఎంచుకున్నారు.
మాతృదినోత్సం యునైటెడ్ స్టేట్స్‌లో సాధారణంగా గౌరవించబడే జాతీయ సెలవుదినం. ఏటా మే రెండో ఆదివారం రోజు మాతృదినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజున పిల్లలంతా తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతారు. అన్ని దేశాలు ఒకే రోజున మదర్స్ డే జరుపుకోనప్పటికీ, మే నెలలో రెండవ ఆదివారాన్ని 50కి పైగా దేశాల్లో ప్రత్యేక దినంగా జరుపుకుంటారు.
మాతృ దినోత్సవం ప్రాముఖ్యత:
తల్లులను గౌరవించుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. మీ తల్లుల ప్రేమ , త్యాగాలకు గౌరవించటానికి , కృతజ్ఞతలు చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మీ తల్లితో మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కూడా అందిస్తుంది. అందువలన, ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో మదర్స్ డేను జరుపుకుంటారు. కొంతమంది ఈ రోజున తమ తల్లులకు ఇంటి పనుల నుండి విరామం ఇచ్చి, వారిని ప్రయాణాలు , విహారయాత్రలకు తీసుకెళ్తే, మరికొందరు తమ తల్లులకు ఇష్టమైన బహుమతిని ఇవ్వడం ద్వారా ఈ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. మొత్తం మీద, మీ తల్లి ప్రేమ , త్యాగానికి ఆమెను గౌరవించడానికి , కృతజ్ఞతలు చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు.