US-China Trade War: అక్కడ కూడా వాణిజ్య యుద్ధం..వదల బొమ్మాళీ వదల అంటున్న ట్రంప్

చైనాను అస్సులు వదిలి పెట్టేదే లేదంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప. ఇప్పటికే వంద శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు సంద్రంలోనూ ఆంక్షలు పెడుతున్నారు. నౌకలపై ప్రత్యేక ఫీజు కట్టాల్సిందేనని ప్రకటించారు.

New Update
Ship war

అమెరికా, చైనాలు నువ్వంటే నువ్వని కొట్టుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్యనా వాణిజ్య యుద్ధం తారాస్థాకి చేరుకుంది. అరుదైన ఖనిజాల విషయంలో చైనాపై కోపం తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు ఆ దేశానికి వంద శాతం అదనపు సుంకాలను విధించారు. దీనికి చనా భగ్గున మండిపడింది. ఎవరితోనూ తగువులు పెట్టుకోవడం ఇష్టం లేదు. కానీ మా జోలికి వస్తే ఊరుకోము అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఇరు దేశాల వాణిజ్య యుద్ధం సముద్రానికి పాకింది. వాణిజ్య నౌకలపై అమెరికా, చైనా దేశాలు ప్రత్యేక ఫీజులు ప్రకటంచాయి. 

ఇరు దేశాల ఓడలపై ఫీజులు

అమెరికా యాజమాన్యం లేదా ఆ దేశ జెండా ఉన్న షిప్ అయినా సరే తమ ఆధీనంలో ఉన్న సముద్రంలోకి వస్తే ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తామంటూ చైనా ప్రకటించింది. దీనిలో కేవలం చైనా నిర్మించిన నౌకలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి ప్రతిగా అమెరికా కూడా ఇవే ఫీజులను మొదలుపెట్టింది. ఈరోజు నుంచి అవి అమల్లోకి వస్తాయని చెప్పింది. 

చర్చలకు సిద్ధమే..

అమెరికాపై చైనా కోపంతో రగిలిపోతోంది. తమపై వంద శాతం అదనపు సుంకాలను విధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సుంకాల విషయంలో అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టింది. ట్రంప్ నిర్ణయాలు తమ దేశాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయని అంది. చైనా దేశ ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. మామూలుగా తాము ఎవరితోనే గొడవలు పడము అని..కానీ ఇలాంటివి చేస్తే ఎంతకైనా తెగిస్తామని..చివర వరకు పోరాడతామని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ట్రంప్‌ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని చెప్పింది. తాము ఇప్పటికీ చర్చలకు సిద్ధంగానే ఉన్నామని చైనా వాణిజ్య శాఖ తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు