కేంద్రం కీలక నిర్ణయం.. CISFలో పూర్తిస్థాయి మహిళల రిజర్వ్ బెటాలియన్‌

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా పూర్తిస్థాయిలో మహిళల రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మంజూరు చేసింది.

New Update
betallion 2

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా పూర్తిస్థాయిలో మహిళల రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మంజూరు చేసింది. విమానాశ్రయాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో పెరుగుతున్న విధులను దృష్టిలో ఉంచుకొని మొత్తం వెయ్యి మందికి పైగా మహిళా సిబ్బందితో కూడిన సీఐఎస్‌ఎఫ్‌  రిజర్వ్‌ బెటాలియన్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.    

Also  Read: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?

CISF

దీనికి సంబంధించి హోం మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ అయ్యాయని అధికారులు చెప్పారు. సీఐఎస్‌ఎఫ్‌లో ప్రస్తుతం 12 రిజర్వ్ బెటాలియన్లు ఉన్నాయి. అయితే మహిళా సిబ్బందితో కూడిన సీఐఎస్‌ఎఫ్‌ రిజర్వ్ దళాలు ఎయిర్‌పోర్టులు, ఢిల్లీ మెట్రోలతో పాటు తాజ్‌మహల్, ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాల వద్ద గస్తీ కాస్తాయని అధికారులు తెలిపారు.  

Also read: వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే

ఇదిలాఉండగా సీఐఎస్‌ఎఫ్‌లో మొత్తం 1.70 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఇది కేంద్రం హోంశాఖ అధీనంలో ఉండే కేంద్ర సాయుధ పోలీసు దళం. ఇది ఢిల్లీలోని పలు కేంద్రశాఖల భవనాలు, పౌర విమానాశ్రయాలు, అణుశక్తి, ఏరోస్పేస్‌ కేంద్రాలకు భద్రత కల్పిస్తుంది. అలాగే పుణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయాలు, జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీ వంటి ప్రైవేటు సంస్థలకూ కూడా తమ సేవలు అందిస్తున్నాయి.  

Also Read: ట్రంప్‌ గెలుపుతో అబార్షన్‌ మాత్రలకు పెరిగిపోయిన డిమాండ్

Also Read: వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే

Advertisment
Advertisment
తాజా కథనాలు