ట్రంప్ గెలుపుతో అబార్షన్ మాత్రలకు పెరిగిపోయిన డిమాండ్ అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత అక్కడ అబార్షన్ మాత్రల కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కోరోజులోనే వీటికోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. ట్రంప్ అబార్షన్ హక్కు నిషేధిస్తారనే వదంతులు రావడంతో మాత్రల కొనుగోళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 12 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ అబార్షన్ మాత్రల కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కోరోజులోనే వీటికోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్ హక్కును నిషేధిస్తారని వదంతలు రావడం వల్ల వీటికి సంబంధించిన ట్యాబ్లెట్‌ల కొనుగోళ్లు భారీగా పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. Also Read: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు? కేవలం 24 గంటల్లోనే అబార్షన్ మాత్రల కోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు రావడంతో.. ఇదిరోజూ ఉండే డిమాండ్ కంటే 17 రేట్లు ఎక్కువని పలు కథనాలు పేర్కొన్నాయి. అంతేకాదు ఆఖరికి గర్భిణీలు కానివారు కూడా ప్రిస్క్రిప్షన్ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని ఓ ఎన్‌జీవో పేర్కొంది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణులు కానివారేనని చెప్పింది. ఎన్నికలకు ముందు అబార్షన్ మాత్రలు ఎక్కడ దోరుకుతాయి అన్న సమాచారం కోసం నిత్యం 4 వేల నుంచి 4500 మంది తమ వెబ్‌సైట్‌లో చూసేవారని.. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సమాచారం కోసం చూసే వారి సంఖ్యలో భారీగా మార్పు కనిపిస్తోందని మరో ఎన్జీవో సంస్థ తెలిపింది. ప్రస్తుతం రోజుకు 82 వేల మందికి పైగా వైబ్‌సైట్ చూస్తున్నారని చెప్పింది. అలాగే అబార్షన్ పరికరాలు, వేసక్టమీ శస్త్రచికిత్సలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. Also Read: మిస్ టీన్ యూనివర్స్ కిరీటం సాధించిన భారతీయ యువతి అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అబార్షన్ హక్కును నిషేధిస్తారనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే చాలామంది మాత్రలు నిల్వ చేసుకుంటున్నట్లు నేషనల్ అబార్షన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిటనీ ఫోంటెనో అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇలా అబార్షన్ మాత్రలు నిల్వచేసుకోవడం ఇది ఫస్ట్‌టైం కాదు. 2022 మే నెలలో కూడా గర్భవిచ్ఛిత్తికి వ్యతిరేకంగా చట్టం తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. అప్పుడు కూడా వీటి గిరాకీ ఏకంగా 10 రేట్లు పెరిగింది. #telugu-news #national-news #donald-trump #usa elections 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి