భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ ఘటననకు ఖండించిన టర్కీ కుట్రను కేంద్రం అడ్డుకుంది. టర్కిష్ సంస్థ సెలెబిని భారత్ నుంచి గెంటేసింది. ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌లో ఈ సెలెబి సంస్థ కీలకంగా ఉంది. అందుకే జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: దేశ ప్రధానిని పొగిడితే తప్పేంటి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరో ప్రకటన
దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ సహా 8 ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో సెలెబి సేవలు అందిస్తోంది. ఏడాదిలో 58 వేల విమానాల రాకపోకలను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. టర్కీష్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సెలెబి.. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్‌మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్‌లో కీలకంగా మారింది.
Also Read: మరోసారి భారీ భూకంపం.. వణికిస్తున్న వీడియోలు
ఇదిలాఉండగా ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌ను టర్కీ ఖండించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు ఇది సపోర్ట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా టర్కీపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అంతేకాదు బాయ్‌కాట్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయ్యింది. టర్కీ టూర్లను రద్దు చేసుకోవాలని.. అలాగే ఆ దేశం నుంచి వాణిజ్యం ఆపేయాలంటూ నెటిజన్లు పోస్టులు చేశారు.
telugu-news | rtv-news